విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ పై పూర్తి అధికారం కేంద్రానిదే అన్న విషయం తెలిసిందే. ప్లాంటును ప్రైవేటికరించాలని నిర్ణయించింది మోడీ ప్రభుత్వం. కేంద్రం చర్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి చేతకాని తనమే అని టీడీపీ విమర్శలు చేస్తోంది. కేంద్రంతో జగన్ కుమ్మక్కై స్టీల్ ప్లాంటును సొంతం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించింది. టీడీపీ ఆరోపణలకు మిగిలిన ప్రతిపక్షాలు సైతం వంత పాడుతున్నాయి.
ప్రధాన మంత్రి మోడీ ఏ విషయంపైనైనా నిర్ణయం తీసుకుంటే ఎంత పట్టుబడతారో తెలిసిందే. అలాంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా, పోలవరం లాంటి అంశాల్లో చంద్రబాబు జగన్ పై విమర్శలు చేయడం చూస్తుంటే ఆయన అమాయకత్వానికి పరాకాష్టగా తెలుస్తోంది. వైసీపీ కూడా ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగుతోంది ఏ విషయంలోనైనా వైసీపీ, ప్రతిపక్షాల మధ్య ఉప్పు-నిప్పులాగా తయారైంది.
విశాఖ స్టీల్ విషయంలో రాజకీయ పార్టీల్లో ఐకమత్యం కనిపించడం లేదు. ఆగస్టు 23 తేదీలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కార్మిక సంఘాలు ఆందోళన చేయాలని భావించారు. ఈ ఆందోళనల్లో కూడా అధికార ప్రతిపక్షాలు కలవడం లేదు. కార్మికసంఘాలు నిర్వహించిన సమావేశానికి వైసీపీనేతలు హాజరైన కారణంగా టీడీపీ నేతలుకనబడలేదు.
రాజకీయ పార్టీల మధ్య ఇంత అనైక్యతుంటే కేంద్రం మాత్రం ఎందుకని ఏపీ ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది. రాష్ర్ట ప్రయోజనాల విషయంలో పార్టీలన్ని ఏ విధంగా ఏకమైపోతాయనే విషయంలో తమిళనాడును చూసి కూడా మన రాజకీయ నేతలు గ్రహించడం లేదు. అందుకే విభజన చట్టాన్ని మోడీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే అడిగేనాథుడే లేకపోయారు.