బీజేపీతో ఫైట్: కాంగ్రెస్ ఏతరులను ఏకం చేస్తున్నాడా?

బీజేపీ ఇప్పుడు దేశంలోనే ఏకైక అత్యంత బలమైన పార్టీగా అవతరించింది. కొన్ని దశాబ్ధాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ సమస్యతో ఆపసోపాలు పడుతోంది. వచ్చే ఎన్నికల వరకూ కూడా కాంగ్రెస్ లేసే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ముందుకు రాకపోవడం.. సోనియాగాంధీ వృద్ధాప్యంతో ఈ పరిస్థితి దాపురించింది. అయితే దేశంలో రోజురోజుకు బలంగా తయారవుతున్న బీజేపీ ఆదిపత్యాన్ని తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ సీనియర్లు. అందుకే ప్రత్యామ్మాయ రాజకీయ శక్తిని […]

Written By: NARESH, Updated On : August 11, 2021 9:36 am
Follow us on

బీజేపీ ఇప్పుడు దేశంలోనే ఏకైక అత్యంత బలమైన పార్టీగా అవతరించింది. కొన్ని దశాబ్ధాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ సమస్యతో ఆపసోపాలు పడుతోంది. వచ్చే ఎన్నికల వరకూ కూడా కాంగ్రెస్ లేసే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ముందుకు రాకపోవడం.. సోనియాగాంధీ వృద్ధాప్యంతో ఈ పరిస్థితి దాపురించింది.

అయితే దేశంలో రోజురోజుకు బలంగా తయారవుతున్న బీజేపీ ఆదిపత్యాన్ని తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ సీనియర్లు. అందుకే ప్రత్యామ్మాయ రాజకీయ శక్తిని తామే తయారు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజును అందుకు వేదికగా మార్చాడు కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్.

తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో కపిల్ సిబల్ ఇచ్చిన పార్టీ పొలిటికల్ మీటింగ్ గా మారింది. ఈ మీటింగ్ కు రాహుల్, సోనియాగాంధీ రాలేదు. కానీ కాంగ్రెస్ లో మార్పు రావాలని నినదించిన చిదంబరం, శశిథరూర్, మనీష్ తివారీ లాంటి సీనియర్ నేతలు హాజరయ్యారు.

ఈ కీలక సమావేశానికి దేశంలోని మొత్తం 23 పార్టీల ప్రాంతీయ పార్టీల నేతలు హాజరయ్యారు. వీరంతా బీజేపీకి వ్యతిరేకంగా మసులుకుంటున్న వారే కావడం విశేషం. ఈ పార్టీలో బీజేపీని ఓడించాలంటే అందరూ ఏకం కావాలన్న ఉద్దేశాన్ని కపిల్ సిబల్ చెప్పినట్టుగా తెలుస్తోంది. లేదంటే ప్రాంతీయ పార్టీలే లేకుండా పోతుందని.. కాంగ్రెస్ తో కలిసి మీరంతా బీజేపీతో తలపడాలని హిత బోధ చేసినట్టుగా తెలుస్తోంది.

దేశంలో బీజేపీ ఏకఛత్రాధిపత్యానికి చెక్ పట్టాలంటే ప్రత్యామ్మాయ రాజకీయ శక్తి అవసరం అని.. ఈ మేరకు కపిల్ సిబల్ హితబోధ చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఆ ప్రత్యామ్మాయంగా ఎదగలేదని.. అంతా కలిసి రావాలని కోరినట్టు తెలుస్తోంది.

మొత్తంగా ఢిల్లీ సర్కిల్స్ లో కపిల్ సిబల్ మొదలుపెట్టిన ఈ బీజేపీ వ్యతిరేక రాజకీయం ఏ మలుపులు తిరుగుతుంది? పార్టీలు ఏకం అవుతాయా? అన్నది ఆసక్తిగా మారింది.న.