https://oktelugu.com/

మహేష్ బాబుకి ఫ్రెష్‌ కథ చెప్పాడట !

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు బర్త్‌ డే సందర్భంగా ఆయనతో సినిమాలు చేస్తోన్న దర్శక నిర్మాతలు ఆయా సినిమాల తాలూకు అప్‌ డేట్స్‌ ను వరుసగా వదిలారు. అయితే, ఎప్పటి నుంచో సందీప్ రెడ్డి – మహేష్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్య్వూలో సందీప్‌ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చాడు. మహేష్ బాబుతో తన సినిమా తప్పకుండా ఉంటుందని.. ఇప్పటికే మహేష్ కి తాను […]

Written By:
  • admin
  • , Updated On : August 11, 2021 / 09:45 AM IST
    Follow us on

    సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు బర్త్‌ డే సందర్భంగా ఆయనతో సినిమాలు చేస్తోన్న దర్శక నిర్మాతలు ఆయా సినిమాల తాలూకు అప్‌ డేట్స్‌ ను వరుసగా వదిలారు. అయితే, ఎప్పటి నుంచో సందీప్ రెడ్డి – మహేష్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్య్వూలో సందీప్‌ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చాడు.

    మహేష్ బాబుతో తన సినిమా తప్పకుండా ఉంటుందని.. ఇప్పటికే మహేష్ కి తాను కథను కూడా వివరించానని.. మహేష్ కి కూడా ఆ కథ బాగా నచ్చిందని.. తమ కాంబినేషన్‌ లో కచ్చితంగా సినిమా ఉంటుందని, అలాగే ఫ్రెష్‌ కథతో తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని సందీప్ రెడ్డి వంగ క్లారిటీగా చెప్పుకొచ్చాడు.

    నిజానికి గత కొంత కాలంగా వీరిద్దరి ప్రాజెక్ట్‌ ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి. వీరి సినిమాకి సంబంధించి కూడా ఎలాంటి అప్‌ డేట్‌ రాకపోవడం కూడా ఆ వార్తలకు బలం చేకూర్చింది. ఇప్పుడు సందీప్ క్లారిటీ ఇచ్చాడు కాబట్టి.. ఇక వీరి సినిమా పై రోజుకొక రూమర్ రావడం ఖాయం. ఇక సందీప్ రెడ్డి బాలీవుడ్ లో క‌బీర్‌సింగ్ తో సూపర్ హిట్ కొట్టి మూడో సినిమాకే 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.

    స్టార్ డైరెక్టర్లకే తమ రేంజ్ ను రెమ్యునరేషన్ ను పెంచుకోవడం సాధ్యం కాని ఈ రోజుల్లో.. ఒక తెలుగు డైరెక్టర్ మూడో సినిమాకి 20 కోట్లు డైరెక్టర్ గా చలామణి అవ్వడం అంటే విశేషమే. ఇక బాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ తర్వాత అక్కడ ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి ఒక్కడే. మొత్తానికి సందీప్ రెడ్డి వంగకి పాన్ ఇండియా డైరెక్టర్ గా డిమాండ్ క్రియేట్ అయింది.