Homeజాతీయ వార్తలుKalisetty Appalan Naidu: కేంద్ర మంత్రివర్గంలోకి ఉత్తరాంధ్ర ఎంపీ.. మోదీ గ్రీన్ సిగ్నల్!

Kalisetty Appalan Naidu: కేంద్ర మంత్రివర్గంలోకి ఉత్తరాంధ్ర ఎంపీ.. మోదీ గ్రీన్ సిగ్నల్!

Kalisetty Appalan Naidu: రాజకీయాల్లో చాలామంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కొందరికి అవకాశాలు చాలా సులువుగా వస్తాయి. మరికొందరికి ఎంత కష్టపడినా అందవు. అయితే ఏ రాజకీయ పార్టీలోనైనా కష్టపడితే కానీ అనుకున్నది సాధించలేరు. అలా కష్టపడి సామాన్య కార్యకర్తగా ఉంటూ ఎంపీ అయ్యారు కలిశెట్టి అప్పలనాయుడు( Kalisetty appalan Naidu) . జర్నలిజం పై ఆసక్తితో ఈనాడులో విలేకరిగా ప్రస్థానం ప్రారంభించారు అప్పలనాయుడు. అప్పుడే రాజకీయాల్లోకి వెళ్లాలని భావించారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నెన్నో అవమానాలను, కష్టాలను అధిగమించారు. పార్టీ అధినేత అవకాశం ఇవ్వడంతో విజయనగరం ఎంపీ అయ్యారు. డైరెక్టుగా లోక్సభలో అడుగు పెట్టారు. తన పనితీరుతో అధినేత చంద్రబాబును మెప్పించడమే కాదు.. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ముగ్ధుడైన నాయకుడిగా మారారు.

Also Read: రాహుల్ గాంధీకి వ్యతిరేక వ్యాఖ్యలు.. మంత్రి పదవి ఊస్ట్! ఇదీ కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యం

విభిన్న శైలి..
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శైలి విభిన్నం. ఏపీ తరఫున పార్లమెంట్ సమావేశాల్లో అత్యధికంగా హాజరు శాతం నమోదు చేసుకుంది ఆయనే. పార్లమెంట్ సమావేశాలకు విధిగా హాజరవుతారు. అది కూడా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటే విధంగా.. అచ్చమైన వస్త్రధారణలో.. సైకిల్ పై పార్లమెంటుకు వెళుతుంటారు. చర్చల్లో విస్తృతంగా పాల్గొంటారు. కొత్త విషయాలు గురించి ఆసక్తిగా తెలుసుకుంటారు. అందుకే 500 మంది ఎంపీలకు పైగా ఉన్న పార్లమెంటులో ఆయనకంటూ ఒక గుర్తింపు దక్కించుకున్నారు. అది కూడా ఏడాది కాలంలోనే. విజయనగరం పార్లమెంటరీ పరిధిలో సమస్యలను ప్రస్తావించడమే కాదు.. రాష్ట్ర సమస్యలను సైతం పార్లమెంటులో ప్రస్తావించి తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు.

ప్రధాని పొగడ్తల వర్షం
ఏపీకి చెందిన టిడిపి ఎంపీల బృందం సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీని( Prime Minister Narendra Modi) కలిసింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో 16 మంది ఎంపీలు పార్లమెంట్ ఛాంబర్ లో ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు తమ పార్టీ ఎంపీలను ప్రధానికి పరిచయం చేస్తూ.. కలిశెట్టి అప్పలనాయుడు అని చూపించారు. దీనిపై వెంటనే ప్రధాని మోదీ స్పందించారు. ఆయన ఎందుకు తెలియదు? ఠంచనుగా పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారు.. కొత్త విషయాల పట్ల మక్కువ చూపిస్తారు.. సమాజానికి మంచి చేయాలన్న ఉత్సాహం కలిగిన వారు అంటూ.. మోడీ చెప్పేసరికి ఆశ్చర్య పోవడం తెలుగుదేశం పార్టీ ఎంపీల వంతు అయ్యింది. అంతలా ప్రధాని మోదీని ఆకర్షించగలిగారు విజయనగరం ఎంపీ అప్పలనాయుడు.

Also Read: వెంకయ్యనాయుడు రీ ఎంట్రీ.. తెర వెనుక ఆర్ఎస్ఎస్!

ఎన్నో ఇబ్బందులను అధిగమించి..
కలిశెట్టి అప్పలనాయుడు రాజకీయ ప్రస్థానం పూల పాన్పు కాదు. ఎన్నెన్నో ఇబ్బందులను అధిగమించి ఈ స్థానానికి ఆయన చేరుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక సామాన్య నాయకుడిని ఈ స్థాయిలో ప్రోత్సాహం దక్కడం అప్పలనాయుడుకు నిజంగా అదృష్టం. వాస్తవానికి ఆయన ఒక సామాన్య నేత. అయితే టిడిపి కార్యకర్తల శిక్షణ శిబిరం డైరెక్టర్ గా సుదీర్ఘకాలం సేవలందించారు. పార్టీ కోసం పరితపించారు. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించేవారు. అలా ఎమ్మెల్యే టికెట్ ఆశావహుడిగా మారారు. అయితే ఈ క్రమంలో కొందరు సీనియర్ నేతలు ఆయనను అణచివేసే ప్రయత్నం చేశారు. కానీ నిలబడ్డారు. అధినేత చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. అన్నింటికీ మించి విజయనగరం రాజు అశోక్ గజపతిరాజు ఆశీర్వాదం పొందారు. అలా 2024 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టిని ఆకర్షించగలిగారు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగి.. తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాలంటే.. బీసీ వర్గానికి చెందిన అప్పలనాయుడు ను పరిగణలోకి తీసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే..!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version