Venkaiah Naidu Politics: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు( venkaiah Naidu ) స్థితప్రజ్ఞుడు. బిజెపిలో ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత క్రియాశీలక రాజకీయాలు తగ్గించారు వెంకయ్య నాయుడు. అయితే ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో.. వెంకయ్య నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు ప్రధాని మోదీ తో ఏకాంత సమావేశాలు.. ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో భేటీలు.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కేంద్రంలో మారుతున్న లెక్కలతోనే వెంకయ్య నాయుడు ఎంట్రీ ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది. వెంకయ్య నాయుడు రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుతారా? ఉపరాష్ట్రపతి పదవిని మరోసారి అందుకుంటారా? లేకుంటే బిజెపి జాతీయ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారా? అన్న టాక్ అయితే ప్రారంభం అయింది.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ కు లోకేష్ షాక్!
సుదీర్ఘ నేపథ్యం..
వెంకయ్య నాయుడు బిజెపిలో( Bhartiya Janata Party) సుదీర్ఘకాలం పనిచేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభమైన వెంకయ్య నాయుడు ప్రస్థానం ఉపరాష్ట్రపతిగా ముగిసింది. అయితే వెంకయ్య నాయుడును భారత రాష్ట్రపతి చేస్తారని అంతా భావించారు. కానీ బిజెపి పెద్దల ఆలోచన వేరేలా సాగింది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మను తెరపైకి తెచ్చి రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టారు. తద్వారా గిరిజనులతో పాటు మహిళల మనసును గెలిచారు. ద్రౌపది ముర్ము ఎంపిక తో ఒడిస్సాలో బిజెపికి సానుకూలత కనిపించింది. ఆ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి కారణం అయ్యింది. అయితే వెంకయ్య నాయుడు సేవలను బిజెపి ఎలా వాడుకుంటుందోనన్న చర్చ జరిగింది. కానీ గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు వెంకయ్య నాయుడు. అయితే కేంద్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో వెంకయ్య నాయుడు అవసరం ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక..
బిజెపి జాతీయ అధ్యక్ష పదవి భర్తీకి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే అంతకంటే ముందే ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎంపిక అనివార్యంగా మారింది. అయితే దక్షిణాది రాష్ట్రాలకు చాన్స్ ఇవ్వాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. కానీ ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇటీవల ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకత్వం మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. అందుకే ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన వెంకయ్య నాయుడును బిజెపి పెద్దలు పిలిచారని.. ఆ సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపించాలని కోరారని.. అందుకే వెంకయ్య నాయుడు వరుసగా భేటీలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే మరోసారి ఉపరాష్ట్రపతి పదవిని వెంకయ్య నాయుడు తీసుకునే అవకాశం లేదు. దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలనుకుంటే.. తమిళనాడుతో పాటు కర్ణాటక నేతల పేర్లను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. మొన్న మధ్యన బీహార్ ప్రధాని నితీష్ కు ఉపరాష్ట్రపతి పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వెంకయ్య నాయుడును పిలిచి చర్చిస్తుండడంతో అసలు ఎంపిక ఎలా ఉంటుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read: సొంత వాహనాల్లోనే ‘మద్యం’ సొమ్ము.. సిట్ ఉచ్చులో ఆ ముగ్గురు!
అధ్యక్ష పగ్గాలు ఇచ్చేందుకు..
మరోవైపు బిజెపి జాతీయ అధ్యక్ష పదవిని భర్తీ చేయాలని భావిస్తోంది హై కమాండ్. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగిసింది. పైగా ఆయన కేంద్ర మంత్రి కూడా. బిజెపిలో జోడు పదవులు ఉండకూడదు అన్నది నిబంధన. అందుకే వెంకయ్య నాయుడుకు బిజెపి జాతీయ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రధానితో 40 నిమిషాలు భేటీ అయిన వెంకయ్య నాయుడు.. ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో సైతం గంట పాటు కీలక చర్చలు జరిపారు. దీంతో వెంకయ్య నాయుడు సేవలను బిజెపి వినియోగించుకుంటుందన్న ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.