KA Paul: సాధారణంగా యుద్ధంలాంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎవరైనా సరే రాజకీయం కోసం చూడరు. వ్యక్తిగత ప్రాపగాండ కోసం ఆరాటపడరు. కానీ అదేం దరిద్రమో.. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తన వ్యక్తిగత ప్రచారం కోసం కేఏ పాల్ వాడుకుంటున్నారు. పొంతన లేని మాటలు మాట్లాడుతూ.. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుంటూ తనను తాను జోకర్ గా మార్చుకుంటున్నారు. ఏమాత్రం పద్ధతి లేకుండా మాట్లాడుతూ.. విలువ పోగొట్టుకుంటున్నారు.. ఇంతకుమించి నికృష్టంగా.. ఇంతకుమించి దరిద్రంగా ఇటీవల కాలంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రవర్తించి ఉండడు.
Also Read: భారత్–పాకిస్తాన్ డ్రోన్ వార్.. యుద్ధంలో సరికొత్త మలుపు!
సరిగ్గా మొన్నటికి మొన్న అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఏమన్నాడంటే.. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిలిపివేయడానికి దాయాది దేశం వెళుతున్నానని ప్రకటించాడు. అంతేకాదు ఇరుదేశాల అధినేతలతో చర్చలు జరుపుతానని ప్రకటించాడు. కాకపోతే కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి తను వెళ్లే అవకాశం లేదని అన్నాడు. తీరా ఇప్పుడేమో తన వల్లే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిందని.. ఫైరింగ్ నిలిచిపోయిందని.. తను రేయింబవళ్లు కష్టపడి యుద్ధాన్ని నిలిపివేశానని చెప్పుకొచ్చాడు. ఇది న్యూస్ ఛానల్స్ టిఆర్పి రేటింగ్స్ పెరగడానికి.. రీల్స్ లో నెటిజన్లు చూడడానికి పనికొస్తుంది ఏమోగానీ.. కేఏ పాల్ మీద ఏమాత్రం గౌరవాన్ని పెంచదు. పైగా జోకర్ అనే అతడి స్థాయిని మరింత కిందకు దిగజార్చుతుంది. నన్ను చూస్తే నవ్వుతున్నారు.. నన్ను చూస్తే ఎగతాళి చేస్తున్నారు.. నన్ను ఒక జోకర్ లాగా చూస్తున్నారు.. అని పదేపదే వాపోయే కేఏ పాల్.. అతడు చేసే చేష్టలు ఈ విధంగా ఉన్నప్పుడు అలా కాకుండా ఇంకెలా అనుకుంటారు. స్కూలుకు వెళ్లే పిల్లాడిలాగా.. మెచ్యూరిటీ లేని యువత లాగా కేఏ పాల్ మాట్లాడుతుంటే.. జోకర్ లాగ కాక ఇంకెలా కనిపిస్తాడు. అన్నట్టు ఆ మధ్య అమెరికా ప్రెసిడెంట్ ను మీట్ అయ్యానని చెప్పిన కేఏ పాల్.. వార్ బిగిన్ కాకముందే ఆపి ఉండాల్సింది కదా.. అంటే ఇప్పుడు కేఏ పాల్ చెప్పారు కాబట్టి ట్రంప్ మధ్యలో వచ్చారా.. కే ఏ పాల్ ఆదేశించారు కాబట్టి ట్రంప్ చర్చలు జరిపారా.. బాబోయ్ ఆలోచిస్తుంటేనే బుర్ర బద్దలవుతోంది.. కే ఏ పాల్ సార్ మీకో పెద్ద దండం.. ఏపీ, తెలంగాణ రాజకీయాలలో మీరు ఎలాంటి వ్యాఖ్యలైనా చేయండి. దేశ అంతర్గత విషయాలను మీ రాజకీయాల కోసం వాడుకోకండి. ఎందుకంటే మీరు చేసే వ్యాఖ్యలు చూస్తుంటే పడి పడి నవి చచ్చిపోతే ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ?! అన్నట్టు ఇన్ని మాటలు మాట్లాడుతున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు.. నేషనల్ న్యూస్ చానల్స్ చూడటం లేదా.. పోనీ ఇంటర్నేషనల్ న్యూస్ చానల్స్ ఫాలో అవ్వడం లేదా.. అసలు ఏం జరుగుతుందో కనీసం తెలుసుకోవడం లేదా..పాల్ సార్.. జర అప్డేట్ అవ్వండి ప్లీజ్.
View this post on Instagram