https://oktelugu.com/

KA Paul: రామోజీరావు నాకు 22 లక్షలు ఇవ్వాలి: బాంబు పేల్చిన కేఏపాల్

KA Paul: కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులుగా.. మత బోధకులుగా ఆయన చేసే రాజకీయం.. భక్తి రెండూ వేర్వేరు.. సీరియస్ డైలాగులతో జనాలకు కామెడీ పంచే కేఏపాల్ అంటే తెలుగు నాట అందరికీ చిరపరిచితమే. కేఏపాల్ పోయిన సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాశాంతిపార్టీ తరుఫున పోటీచేసి ఎంత గోల చేశారో అంతా చూశాం. తాజాగా ఉక్రెయిన్ పై పడ్డాడు కేఏ పాల్. అక్కడి యుద్ధాన్ని ఆపలేని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించాడు. అమెరికా అధ్యక్షుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 6, 2022 / 04:05 PM IST
    Follow us on

    KA Paul: కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులుగా.. మత బోధకులుగా ఆయన చేసే రాజకీయం.. భక్తి రెండూ వేర్వేరు.. సీరియస్ డైలాగులతో జనాలకు కామెడీ పంచే కేఏపాల్ అంటే తెలుగు నాట అందరికీ చిరపరిచితమే. కేఏపాల్ పోయిన సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాశాంతిపార్టీ తరుఫున పోటీచేసి ఎంత గోల చేశారో అంతా చూశాం.

    తాజాగా ఉక్రెయిన్ పై పడ్డాడు కేఏ పాల్. అక్కడి యుద్ధాన్ని ఆపలేని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించాడు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడినంత కూడా మోడీ మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు. ఇక్కడి మీడియాను కూడా మోడీ స్నేహితులైన వ్యాపారవేత్తలు అంబానీ, అదానీలు కొనేశారని.. వారి చెప్పుచేతుల్లోకి తెలుగు మీడియా కూడా వచ్చి చేరిందని ఆరోపించారు.

    తెలుగు మీడియా నావార్తలు, వీడియోలు కవర్ చేయడం లేదని కేఏపాల్ ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఈనాడు, ఈటీవీలు తన వార్తలు ప్రసారం చేయడం లేదని మండిపడ్డారు. 2007లోనే తాను ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు 22 లక్షలు అప్పుగా ఇచ్చానని.. అయినా కూడా తన వార్తలు ప్రసారం చేయడం లేదన్నారు. అంబానీకి ఈటీవీని అమ్మిని రామోజీరావు తను అప్పు ఇచ్చిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాలని.. వాటిని పేదల కోసం ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు..

    ఈనాడును ఎవరూ చదవవద్దు.. చూడవద్దని.. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ మనల్ని బాగా కవర్ చేస్తుందని.. అందరూ దాన్నే చూడాలని పిలుపునిచ్చారు. మొత్తం కేఏపాల్ చేస్తున్న వ్యాఖ్యలు.. వెల్లడిస్తున్న నిజాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

    వీడియో