Homeఎంటర్టైన్మెంట్OkTelugu Movie Time: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్...

OkTelugu Movie Time: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్ !

OkTelugu Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. అగ్ర కథానాయకుడు చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకరంగా కలిశారు. శనివారం చిరంజీవి నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. ఏప్రిల్‌లో నిర్వహించే అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు దక్కిన గౌరవమని ఈ సందర్భంగా చిరంజీవి అన్నారు. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

OkTelugu Movie Time
Chiranjeevi Kishan Reddy

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. పుష్పతో ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు అల్లు అర్జున్. ‘ఇది సార్‌ నా బ్రాండు’ అని అదరగొట్టిన బన్నీని ఏ కంపెనీ అయినా బ్రాండ్‌ అంబాసిడర్‌గా తీసుకోవాలనుకుంటుంది. అయితే ఫ్రూటీ విషయంలో పార్లే ఆగ్రో బన్నీని తొలగించి మరీ రామ్‌ చరణ్‌కి ఆఫర్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బన్నీ ఎక్కువ డిమాండ్ చేశాడని ఓ టాక్‌ అయితే, RRRని దృష్టిలో పెట్టుకొని అలియా-చరణ్‌ జోడీని తీసుకున్నట్టు మరో టాక్‌ నడుస్తోంది.

OkTelugu Movie Time
Allu Arjun

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. సంపాదనపరంగానే కాక సహృదయతలోనూ శ్రీమంతుడు అనిపించుకున్నారు మహేష్‌ బాబు. బుర్రిపాలెం, సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకోవడమే కాదు, చాలామంది పిల్లలకి గుండె ఆపరేషన్‌ కూడా చేయించారు. ఈక్రమంలో రెయిన్‌బో హాస్పిటల్స్‌, ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ అనే ఛారిటీని ప్రారంభించారు. దీని ద్వారా చాలా పసి హృదయాలకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు.

OkTelugu Movie Time
Mahesh Babu

Also Read: అన్నదమ్ముల అనుబంధానికి మెగా బ్రదర్స్ కొలమానం !

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. ప్రీమియర్స్‌తో RRR ఒకరోజు ముందుగా, అంటే మార్చ్‌ 24నే పలకరించనుంది. ఈక్రమంలో నిన్ననే అడ్వాన్స్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేశారు. ఏ చిత్రానికి లేనంత క్రేజీగా ప్రీమియర్‌ టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ట్రేడ్‌ వర్గాల ప్రకారం యూఎస్‌లో 267 లోకేషన్లలో 935 షోస్‌కి అప్పుడే $500k వచ్చేశాయట. ఇంకా 20 రోజులు ఉండగా, ప్రీ టికెట్‌ సేల్స్‌లో సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు. చరణ్‌, తారక్‌ అభిమానులు ఒక్క టికెట్‌తో ఆగట్లేదట.

OkTelugu Movie Time
RRR

Also Read: టాలీవుడ్ సెలెబ్రిటీల బ్రదర్స్ – సిస్టర్స్ రిలేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version