KA Paul: వరల్డ్ పీస్ కోసం పాటుపడుతున్నానని పదేపదే చెబుతుంటారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు..ఇటీవల అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాద దేశం, ఇండియా మధ్య నెలకొన్న వార్ ను నిలువరించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక నిన్నటికీ నిన్న రెండు దేశాలు ఫైరింగ్ స్టాప్ చేయడంతో.. ఒక్కసారిగా సెల్ఫీ వీడియోతో బయటికి వచ్చారు. రెండు దేశాల మధ్య ఫైరింగ్ నిలుపుదల చేయడంలో తను కీ రోల్ ప్లే చేసినట్టు పేర్కొన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ తో వ్యూహాత్మకంగా వ్యవహరించానని..వార్ వల్ల జరిగే నష్టాన్ని వివరించానని.. దానికి అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అగ్రీ అయ్యారని.. పాకిస్తాన్ ఇండియా అధిపతులకు కూడా ఆయన అదే విషయం చెప్పారని.. మొత్తంగా తన వల్లే వార్ కు ఫుల్ స్టాప్ పడిందని కేఏ పాల్ గొప్పలు చెప్పుకున్నారు. పాల్ రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియో వల్ల సోషల్ మీడియాలో నవ్వుల పూశాయి. అంతేకాదు ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేసింది.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు రిలీజ్ చేసిన వీడియో వల్ల స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందామని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు.. కానీ నేను రాత్రి నుంచి ఉగ్ర దేశం మళ్ళీ ఫైరింగ్ మొదలుపెట్టింది. బార్డర్ ఏరియాలలో ఇష్టానుసారంగా ఫైరింగ్ చేసింది. దీనికి ఇండియన్ ఆర్మీ కూడా కౌంటర్ గట్టిగానే ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో నష్టం అనేది జరగకుండా ఉండడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేసింది.
Also Read: ఆ విషయంలో మహేష్ బాబు చెప్పినట్టుగా రాజమౌళి వింటున్నాడా..?
ఇప్పుడు మళ్లీ
టెర్రరిస్ట్ కంట్రీ మళ్లీ ఫైరింగ్ మొదలు పెట్టడంతో తెరపై కేఏ పాల్ వచ్చేశారు.. ఇటీవల టెర్రరిస్ట్ కంట్రీ కి టర్కీ వెపన్స్ ఎక్స్పోర్ట్ చేసింది. కొన్ని రకాలైన మిస్సైల్స్ కూడా ఇచ్చింది. దీంతో టర్కీ పై కే ఏ పాల్ విపరీతమైన ఆగ్రహాన్ని పెంచుకున్నారు. క్రమంలోనే ఆయన బాంబే నుంచి టర్కీ వెళ్లి.. ఆ దేశ అధినేతతో కలిసి మాట్లాడాలని భావించారు. మొత్తంగా పాకిస్తాన్ చేస్తున్న తప్పును తుర్కిమెనిస్తాన్ ద్వారా సరిదిద్దాలని అనుకున్నారు. కానీ పాల్ ను ముంబై విమానాశ్రయంలోనే అక్కడి సిబ్బంది ఆపేశారు. లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు కేఏ పాల్ సబ్మిట్ చేసినప్పటికీ.. విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు సెల్ఫీ వీడియో తీసుకొని.. విమానాశ్రయ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును బయటపెట్టారు. ” నేను అమెరికన్ ప్రెసిడెంట్ తో ఫోన్లో మాట్లాడాను. యుద్ధాన్ని ఆపడానికి టర్కీ వెళ్తున్నాను. కానీ వీళ్ళేమో నన్ను ఇక్కడ ఆపేశారు. మీడియా మిత్రులారా మీరు బ్రేకింగ్ న్యూస్ వేయాలి. నన్ను ఎవరు అడ్డుకుంటున్నారు.. ఎందుకు అడ్డుకుంటున్నారు.. యుద్ధాన్ని ఆపడానికి నేను చేస్తున్న ప్రయత్నాన్ని ఎవరు అడ్డగిస్తున్నారు.. ప్రజలారా మీరు గమనించాలి.. నేను శాంతిస్థాపన కోసం చేస్తున్న కృషిని మీరు గుర్తించాలి. మీడియా మిత్రులారా ఈ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ ద్వారా మీరు ప్రజలకు తెలియ చెప్పాలని” ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఆ వీడియోలో కోరారు..ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
View this post on Instagram