Mahesh Babu: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి (Rajamouli) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడిగా మారిన ఈయన ప్రస్తుతం వరల్డ్ సినిమా ఇండస్ట్రీని సైతం షేక్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. మరి రాజమౌళి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది. తద్వారా రాజమౌళికి ఎలాంటి ఐడెంటిటిని తీసుకొచ్చి పెడుతుంది. మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో స్టార్ హీరోగా మారబోతున్నాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక రాజమౌళి తను ఏ స్టార్ హీరోతో సినిమా చేసిన కూడా ఆయన పెట్టిన కండిషన్స్ ని హీరోలు ఫాలో అవుతూ ముందుకు సాగుతూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం రాజమౌళి మహేష్ బాబు పెట్టిన కండిషన్స్ ని ఫాలో అవుతున్నాడట. రాజమౌళి మొదట మహేష్ బాబుకి కండిషన్స్ ను పెట్టాలనే ప్రయత్నం చేశాడు. కానీ మహేష్ బాబు మాత్రం వాటిని బ్రేక్ చేస్తూ వస్తున్నాడు.
Also Read: ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కి పవన్ భారీ ఆర్ధిక సాయం..కంటతడి పెట్టిస్తున్న వీడియో!
దాంతో పాటుగా మహేష్ బాబునే రివర్స్ లో రాజమౌళికి కొన్ని కండిషన్స్ అయితే పెడుతున్నారట. తను ఏ టైమ్ నుంచి ఏ టైమ్ వరకు షూట్ చేయాలి. ఎప్పుడు సెట్ కి రావాలి, ఎప్పుడు సెట్ నుంచి వెళ్ళిపోవాలి అనేది మొత్తం మహేష్ బాబు డిసైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి దానికి రాజమౌళి సైతం ఓకే అన్నట్టుగా సమాధానం ఇచ్చాడట. ఇక మొత్తానికైతే రాజమౌళి మహేష్ బాబు చెప్పినట్టుగా వింటున్నారట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా 2027వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నాడు.
ఇక దానికి మహేష్ బాబు కూడా సహకరిస్తున్నప్పటికి మధ్య మధ్యలో కొన్ని ట్రిప్పులకు మహేష్ బాబు వెళ్తూ షూట్ కి కొంత విరామం అయితే ఇస్తున్నాడు. మరి రాజమౌళికి ఈ విషయంలో మహేష్ బాబు కొంతవరకు కోపాన్ని తెప్పిస్తున్నప్పటికి సినిమా అనుకున్న టైమ్ కి వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారట…