Homeఎంటర్టైన్మెంట్Vishwak Sen: పాన్ వరల్డ్ మూవీగా కల్ట్, కొబ్బరికాయ కొట్టిన విశ్వక్ సేన్!

Vishwak Sen: పాన్ వరల్డ్ మూవీగా కల్ట్, కొబ్బరికాయ కొట్టిన విశ్వక్ సేన్!

Vishwak Sen: విశ్వక్ సేన్ గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. మెకానిక్ రాకీ, లైలా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. లైలా మూవీ ప్రయోగాత్మకంగా తెరకెక్కింది. విశ్వక్ సేన్ రెండు భిన్నమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కంటెంట్ లేకపోవడంతో లైలాను జనాలు ఆదరించలేదు. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఇచ్చిన విశ్వక్ సేన్ స్ట్రాంగ్ కమ్ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఆయన ఏకంగా పాన్ వరల్డ్ మూవీతో రానున్నాను. అది కూడా స్వీయ దర్శకత్వంలో. కల్ట్ టైటిల్ తో గతంలో విశ్వక్ సేన్ మూవీ ప్రకటించాడు. నేడు హైదరాబాద్ లో కల్ట్ మూవీ షూటింగ్ మొదలైంది.

Also Read: ఆ విషయంలో మహేష్ బాబు చెప్పినట్టుగా రాజమౌళి వింటున్నాడా..?

కల్ట్ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్, యజ్ఞ తుర్లపాటి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వియత్నాం లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా కల్ట్ తెరకెక్కనుంది. ఈ చిత్రం ద్వారా 20 కొత్త నటులను పరిశ్రమకు పరిచయం చేయనున్నట్లు విశ్వక్ సేన్ ప్రకటించడం విశేషం. తారక్ సినిమాస్, వనమాయె క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

దర్శకుడిగా విశ్వక్ సేన్ కి కల్ట్ మూడవ చిత్రం. గతంలో ఆయన ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ చిత్రాలు తెరకెక్కించాడు. వీటిలో ఫలక్ నుమా దాస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక కల్ట్ చిత్రానికి తరుణ్ భాస్కర్ మాటలు అందించడం విశేషం. కాగా కల్ట్ చిత్రాన్ని స్పానిష్, జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో సైతం విడుదల చేయనున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదలవుతున్న విశ్వక్ సేన్ మొదటి చిత్రం కల్ట్ అని చెప్పొచ్చు. ఇండియాలో మాత్రం కల్ట్ కేవలం తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారట.

ఇక విశ్వక్ సేన్ కి కల్ట్ సక్సెస్ చాలా అవసరం. ఆయన విజయాల పరంగా వెనుకబడ్డారు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన గామీ మాత్రమే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పర్లేదు అనిపించుకుంది. స్టార్డం తెచ్చిపెట్టే క్లీన్ బ్లాక్ బస్టర్ విశ్వక్ సేన్ కి పడటంలేదు. తరచుగా వివాదాల్లో ఉండటం కూడా విశ్వక్ సేన్ కి మైనస్ అని చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular