Pawan Kalyan- Junior NTR: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వైపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో పరిణామాలు ఎలా మారుతున్నాయో తెలియడం లేదు. పొత్తుల వ్యవహారంలో పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో అంతుచిక్కడం లేదు. ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో టీడీపీకి ఎటు పాలుపోవడం లేదు. టీడీపీ తమ పార్టీ ప్రచారకర్తగా జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొస్తే ఫలితం ఉంటుందని కొందరి వాదన. కానీ అందుకు అధినేత చంద్రబాబు ఏ మేరకు ఒప్పుకుంటారోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో ప్రచారం చేసి పార్టీ ఓటు బ్యాంకును పెంచారు. మరి ఇప్పుడు కూడా ఆయన పాత్ర ప్రధానంగా కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి రావాలంటే ఎన్టీఆర్ అవసరం ఎంతైనా ఉంది.

మరోవైపు బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడంతో టీడీపీకి షాక్ తగిలినట్లు అవుతోంది. పవన్ కల్యాణ్ తమ వెంట ఉంటే విజయం తథ్యమని చంద్రబాబు నమ్ముతున్నా పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో హైదరాబాద్ లో నిర్వహించిన పార్టీ సమావేశాల సందర్భంగా అమిత్ షా, ఎన్టీఆర్ మధ్య సమావేశం జరిగింది. ఇందులో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని చెబుతున్నా లోపల మాత్రం అదే విషయంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Also Read: Pawan Kalyan- Jeevitha Rajasekhar: పవన్ కళ్యాణ్ తో జీవిత భేటీ? అసలు కథేంటి?
టీడీపీ, బీజేపీ పొత్తు కలిస్తేనే జనసేనతో కలిసే అవకాశం ఉంటుంది. అందుకే చంద్రబాబు రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో మరోమారు అధికారం దక్కాలంటే పొత్తు అనివార్యం అని భావిస్తున్నారు. కానీ పొత్తుల విషయంలో టీడీపీకి ఏ దారి కానరావడం లేదు. దీంతోనే ఆయన పవన్ కల్యాణ్ తో జతకట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల కంటే ముందు టీడీపీతో జనసేన పొత్తుతోనే అధికారం దక్కినట్లు తెలిసిందే. ఇప్పుడు కూడా అవే పరిణామాలు పునరావృతం కావాలని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు.
పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీతోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. 2024 ఎన్నికల్లో రాజకీయాలు ఎటు వైపు తిరుగుతాయో అంతుచిక్కడం లేదు. అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనే క్రమంలో ఎవరు ఎవరితో పొత్తుపెట్టుకుంటారో కూడా అవగతం కావడం లేదు. ఈ క్రమంలో పార్టీల భవితవ్యం ఏమిటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. అధికార పార్టీ వైసీపీ మాత్రం మరోమారు అధికారం చేపట్టకూడదనేది అందరి వాదన. దీని సాధ్యం కోసం పార్టీలు ఏం నిర్ణయం తీసుకుంటాయో కూడా అర్థం కావడం లేదు. దీనిపై ఓటర్లలో కూడా ఉత్కంఠ నెలకొంది. రాబోయే ఎన్నికల్లో ఎవరు ప్రజామోదం పొంది అధికారం చేపడతారోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది దేనికి సంకేతమో తెలియడం లేదు. ఏపీలో రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య పొత్తుల విషయంలో చర్చలు జరుగుతాయా? లేక ఇంకేదైనా ప్రత్యేక ఎజెండా ఉందా అనేది తేలడం లేదు. మొత్తానికి వీరి కలయిక రాష్ర్ట రాజకీయాల్లో సంచలనం కానుంది. ఇద్దరు అగ్రహీరోల భేటీలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతో పొత్తు విషయంపై చర్చిస్తారా అనే సంశయాలు వస్తున్నాయి.
Also Read:Krithi Shetty: జనసేన ప్రచారంలో బేబమ్మ… ఆమె ఆన్సర్ కి పవన్ ఫ్యాన్స్ ఫిదా!