Pawan Kalyan- Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఏదో ఒక వివాదంలో చిక్కుకుని పాపులర్ కావడం వారికి తెలిసిన విద్యే. ఏ పని చేసినా వారి ప్రత్యేకత వేరేలా ఉంటుంది. గొడవలైనా చర్చలైనా వారు దిగితే మరోలా మారతాయి. సినిమా పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించికున్న వీరు రాజకీయాల్లో కూడా రాణించాలని చూస్తున్నారు. ఈ మేరకు వారు బీజేపీలో చేరారు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కూడా బీజేపీతో పొత్తు ఉన్న పార్టీ కావడంతో ఆమె తాజాగా పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ మాతృక తమిళం కావడంతో ఆయన చిత్తూరు నుంచి పోటీకి రెడీ అవుతున్నట్లు సమాచారం.

జీవిత తెలంగాణ నుంచి పోటీలో నిలవాలని చూస్తున్నారా? లేక ఆంధ్రప్రదేశ్ నుంచే బరిలో ఉండాలని భావిస్తున్నారో అంతుచిక్కడం లేదు. పవన్ కల్యాణ్ తో జరిగిన భేటీ దాదాపు పదిహేను నిమిషాలు కొనసాగినట్లు సమాచారం. ఇందులో ఆమె ఏ ప్రాంతం నుంచి పోటీ చేయాలని అనుకుంటుందో పవన్ కల్యాణ్ తో చర్చించినట్లు చెబుతున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు ఉన్నందున బీజేపీ నుంచి పోటీ చేసినా తన మద్దతు కూడగట్టాలనే ఉద్దేశంతోనే ఆయనను కలిసినట్లు అర్థమవుతోంది.
ఇటీవల కాలంలో రాజకీయాల ప్రభావం సినిమా తారలపై బలంగానే పడుతోంది. అందరు పార్టీల్లో చేరి ప్రచారం చేసి పదవులు పొందినవారే. ఈ నేపథ్యంలో జీవిత రాజశేఖర్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళనాడుకు చిత్తూరు దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి పోటీకి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారనే వాదన కూడా వస్తోంది. ఏదిఏమైనా రాజశేఖర్ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ భవిష్యత్ దృష్ట్యా ఎమ్మెల్యే టికెట్ అడగాలని యోచిస్తున్నారు.

బీజేపీ టికెట్ పై పోటీ చేయాలని చూస్తున్నారు. దీంతో వారు ఎక్కడి నుంచి పోటీలో ఉంటారనేదానిపై కచ్చితమైన అభిప్రాయం మాత్రం చెప్పడం లేదు. మొత్తానికి ఎన్నికల బరిలో నిలుస్తారని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా సినీ గ్లామర్ ను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్, నితిన్ లను తమ పార్టీ తరఫున ప్రచారం చేసే దిశగా ఒప్పించనున్నట్లు వారి భేటీల ద్వారా అర్థమవుతోంది. 2024 ఎన్నికల్లో బీజేపీ అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో తన ప్రభావం చూపాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సంకేతాలు వస్తున్నాయి.
[…] […]