CM Jagan- Ganji Chiranjeevi: గత ఎన్నికల్లో ఏపీలో దారుణ ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీని వీడుతున్న వారి సంఖ్య ఎక్కువుతోంది. చంద్రబాబు వయసు అయిపోవడం.. ఆయన వారసుడు లోకేష్ పై నమ్మకం లేకపోవడం.. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపుపై ఆశలు లేని వారంతా ప్రత్యామ్మాయం చూసుకుంటున్నారు. అయితే వైసీపీ..లేదంటే జనసేన వైపు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గంజి చిరంజీవి తాజాగా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మంగళగిరి నియోజకవర్గంలో చిరంజీవి వైసీపీ తరుఫున పోటీచేసే అవకాశాలున్నాయని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. మంగళగిరిలో టీడీపీ అధినేత కుమారుడు నారాలోకేష్ పై పోటీకి చిరంజీవిని దింపుతారని అంటున్నారు.
2019లో నారా లోకేష్ మంగళగిరి నుంచే పోటీచేశారు. వైసీపీ తరుఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా లోకేష్ ను ఓడించడం రాజకీయవర్గాల్లో సంచలనమైంది. ఇక నారా లోకేష్ కంటే ముందు మంగళగిరిలో టీడీపీ తరుఫున చిరంజీవి పోటీచేసి అతి తక్కువ ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఈసారి వైసీపీ తరుఫున చిరంజీవి టికెట్ ఆశిస్తున్నారు. ఆళ్ల కంటే తానే బెటర్ అని.. తనకే టికెట్ ఇవ్వాలని చిరంజీవి అప్పుడే జగన్ నుంచి హామీ కోసం ఒత్తిడి తెచ్చారడట.

ఇక చేరి కొన్ని రోజులు కూడా కాకముందే గంజి చిరంజీవికి కీలక బాధ్యతలు అప్పగించాడు వైఎస్జగన్. వైసీపీ రాష్ట్రచేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఒకప్రకటన విడుదల చేసింది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఆయనను చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఓ మంచి గుర్తింపు లభించిందనే అభిప్రాయం మంగళగిరిలో వ్యక్తమవుతోంది. చిరంజీవికి , ఆయన సామాజికవర్గానికి జగన్ కీలక పదవి ఇచ్చాడని.. అదృష్టం అంటే చిరంజీవిదేనని అంటున్నారు