https://oktelugu.com/

Jeelugu Kallu: ఏపీలో స్వల్ప ధరకే ఆర్గానిక్ మద్యం.. తాగేటోళ్లకు తాగినంత.. ఎగబడుతున్న జనాలు

Jeelugu Kallu: మద్యంలో రకరకాల బ్రాండ్లు ఉంటాయి. ఈ మధ్యన ఏపీలో జె బ్రాండ్ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ బ్రాండ్ల మాట దేవుడెరుగు కానీ.. విశాఖ మన్యంలో మాత్రం ‘జీకే’ బ్రాండ్ మాత్రం తెగ అమ్ముడవుతోంది. అలాగని ఇది ఆరోగ్యానికి హానిచేసే మద్యం కాదు. వందలాది రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి లేదు. రూ.20 ఇస్తే చాలూ లీటరు జీకే దొరుకుతుంది. ఒంటికి ఆరోగ్యంతో పాటు కావాల్సినంత కిక్కు ఇస్తోంది. ప్రస్తుతం […]

Written By:
  • Dharma
  • , Updated On : June 4, 2022 / 10:16 AM IST
    Follow us on

    Jeelugu Kallu: మద్యంలో రకరకాల బ్రాండ్లు ఉంటాయి. ఈ మధ్యన ఏపీలో జె బ్రాండ్ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ బ్రాండ్ల మాట దేవుడెరుగు కానీ.. విశాఖ మన్యంలో మాత్రం ‘జీకే’ బ్రాండ్ మాత్రం తెగ అమ్ముడవుతోంది. అలాగని ఇది ఆరోగ్యానికి హానిచేసే మద్యం కాదు. వందలాది రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి లేదు. రూ.20 ఇస్తే చాలూ లీటరు జీకే దొరుకుతుంది. ఒంటికి ఆరోగ్యంతో పాటు కావాల్సినంత కిక్కు ఇస్తోంది. ప్రస్తుతం అంతా ఇప్పుడు ‘జీకే’ బ్రాండ్ హవా నడుస్తోంది. ఇంతకీ జీకే అంటే తెలుసా.. అదేనండీ జీలుగ కల్లు. నిషా ఇచ్చే ఆరోగ్య కరమైన జీలుగు కల్లు. ఈ కల్లును జీలుగు చెట్టు నుంచి తీస్తారు కాబట్టే జీలుగు కల్లు అంటారు. విశాఖ మన్యంలో ఇంటికొక కల్లు దుకాణం ఉంటుంది. అక్కడకు వచ్చే టూరిస్టులు సైతం పోటీ పడి మరీ లొట్టలు వేసుకుంటూ తాగేందుకు అక్కడ క్యూ కడుతున్నారు. ఏకంగా ముందస్తు బుకింగ్‌ కూడా చేసుకుంటున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ జీలుగు కల్లుకు ఎంత డిమాండ్‌ ఉందో. అసలే వేసవి కావడంతో కుర్రకారు చల్లని బీర్లు బదులు జీలుగ కల్లునే తాగుతున్నారు. ఒక్కో బీరుకు రూ.200 ఇచ్చే బదులు దాదాపు ఎనిమిది లీటర్ల కల్లు వస్తుందని చెబుతున్నారు.

    Jeelugu Kallu

    ప్రతీ ఇంటా చెట్టు..
    గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఇంటి వద్ద జీలుగు చెట్టు దర్శనమిస్తోంది. చెట్టును పెంచుకోవడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతుంది. గిరిజనులు ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర జీలుగ కల్లు విక్రయాలు చేస్తూ ఉంటారు. వారికి అదే జీవనాధారం. సీజన్‌లో ఒక చెట్ట కి లక్ష రూపాయలు వరకు ఆదాయం వస్తుంది. పూర్వీకుల కాలం నుంచి గిరిజనులు పోడు వ్యవసాయం పొలం పనులు చేసుకుని వచ్చి పురుషులు, మహిళలు అని సంబంధం లేకుండా కల్లు సేవిస్తుంటారు. సిటీ నుండి వచ్చిన వారికి చెట్టు ఎక్కి తాజా కల్లు తీసి ఇస్తారు. ఇక్కడ చెంబు, లోటా, డోకులు లెక్క కల్లు అమ్మకాలు చేస్తూ ఉంటారు.

    Also Read: Nagababu: నాగబాబు పోటీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? అసలు కారణాలేంటి?

    ఒక్కో చెంబు 20 రూపాయలు. అంతేకాదు కల్లుతో పాటు చికెన్ చీకులు కూడా అందుబాటులో పెట్టడం కల్లు ప్రియులకు మంచి హుషారు వస్తుంది. గిరిజనులు జీలుగు చెట్టును ఒక దైవంగా భావిస్తారు. ఆ కల్లు తాగే సమయంలో చెప్పులు విడిచి తాగాలి అని , అలా కాదని చెప్పులు వేసుకొని తాగితే చెట్టు చనిపోతుంది వారి నమ్మకం విశాఖ ఏజెన్సీ ప్రాంతం మంచి టూరిస్ట్‌ స్పాట్‌లు అధికం. అరకు, పాడేరు, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు,హకుంపేటలో చూడచక్కని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఏడాది అంతా పర్యాటకులు వెళ్తూనే ఉంటారు. మన్యంలో దొరికే రకరకాల ఫుడ్‌ వెరైటీస్‌ను ట్రై చేస్తుంటారు. అలాగే మన్యంలో మాత్రమే దొరికే అసలు సిసలైన జీలుగు కల్లును తాగేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలా పర్యాటకులకు జీలుగు కల్లు అమ్ముతూ గిరిజనులు ఆదాయం పొందుతున్నారు.

    Jeelugu Kallu

    ఉపయోగాలెన్నో..
    ఈ జీలుగు కల్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సైతం చెబుతారు. నగరాలు, పట్టణాలలో నివసించే ప్రజలు ప్రతిరోజు మసాల ఆహారాలు, జంక్‌ ఫుడ్స్‌ వంటివి తీసుకుంటారు. దీంతో ఉదర సమస్యలతో బాధపడుతారు. అలాంటి వారికి కల్లు ఒక దివ్య ఔషధమని చెప్పతున్నారు గిరిజనులు. కల్లులో ఉండే గుణాలు కడుపుని క్లీన్ చేస్తాయని, అందుకే నగరవాసులు ఏడాదిలో ఒక్కసారైనా ఈ జీలుగు కల్లు తాగాలని అంటారు. పబ్‌లు, బార్‌లో తాగే మత్తు పానీయాలు, వైన్ , బ్రాందీ, విస్కీ.. ఇలాంటివి ఆరోగ్యానికి ఎంతో హానికరం…కానీ ఈ ట్రైబల్‌ ట్రెడిషినల్‌ వైన్‌ సేవిస్తే ఆరోగ్యం అని చెప్తున్నారు. అందుకే జీలుగ కల్లుకు భలే డిమాండ్. విశాఖ సిటీ నుంచి కల్లు తాగేందుకు ప్రత్యేకంగా మన్యం వెళుతున్న వారి సంఖ్య ఇటీవల రెట్టింపవుతోంది. జీలుగు కల్లు తాగితే ఏ అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. కిడ్నీ రాళ్ళ సమస్యతో పాటు షుగర్, బీపీ లాంటి సమస్యలు కూడా దరి చేరవని అక్కడి ప్రజల నమ్మకం.

    Also Read:Chandrababu-NTR Family: చంద్రబాబు, ఎన్టీఆర్ ఫ్యామిలి..దూరం పెరిగిందా? అసలు కథేంటి?

    Tags