Nagababu: మెగా బ్రదర్ నాగబాబు జనసేనలో కీ రోల్ పాత్ర వహించనున్నారా? పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారా? ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారా? అంటే ఆయన మాటలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నాగబాబు మెగా అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసే బాధ్యతలు తీసుకున్నారు. మేథావులు, తటస్థులను, పూర్వాశ్రమం పీఆర్పీ నాయకులను, వివిధ వర్గాల వారిని పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉండగానే.. వ్యూహాలకు పదును పెడుతున్నారు. వాస్తవానికి జనసేన ఆవిర్భవించి ఎనిమిదేళ్లవుతున్నా పార్టీలో నాగబాబు అంతంతమాత్రంగా ఉండేవారు. పవన్ తరువాత అంతా నాదేండ్ల మనోహరే చూసుకునేవారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు.
ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో పడ్డారు. అవి పూర్తయ్యాక రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇంతలో పార్టీని చక్కదిద్దే బాధ్యతను సోదరుడు నాగబాబుకు అప్పగించారు. అయితే గత అనుభవాల నేపథ్యంలో నాగబాబు క్రియాశీలకమయ్యారు. ఇప్పటికే అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి కుటుంబసభ్యుల బలం ఉంది. సొంత సామాజికవర్గం నాయకులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వైసీపీకి సంబంధించి జగన్ సమీప బంధువులు, రెడ్డి సామాజికవర్గం నాయకులు మూలస్తంభాలుగా ఉన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పార్టీ సమన్వయ బాధ్యతలు జగన్ తన సొంత వారికే అప్పగించారు. ఇక టీడీపీలో చంద్రబాబు తరువాత కుమారుడు లోకేష్ ఉన్నారు. బావమరిది బాలక్రిష్ణతో పాటు కమ్మ సామాజికవర్గం నాయకులు అండగా నిలుస్తున్నారు. అందుకే ఎన్నికలకు ముందస్తుగానే మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగారు. కొద్దిరోజుల్లో జనసేనను బలోపేతం చేయడానికి మెగా సన్నిహితులను రంగంలోకి దించనున్నట్టు సమాచారం.
Also Read: Pawan Kalyan- Minister Viswarup: పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న ఆ ఏపీ మంత్రి ఎవరో తెలుసా?
వచ్చే ఎన్నికలను జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఏ అవకాశాన్ని విడిచిపెట్టకూడదని నిర్ణయించుకుంది. అటు అధికార పక్షం అరాచకాలను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతుంది. ఇందుకుగాను ఒక టీమ్ ను ఏర్పాటుచేసుకుంటోంది. అందుకే తాను వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. తద్వారా ఎన్నిక కేంపెయినర్ గా వ్యవహరించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ పాదయాత్రతో సమానమైన యాత్రను చేపట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని నాగబాబు చెబుతున్నారు. చిరంజీవి మద్దతు పూర్తి స్థాయిలో జనసేనకే ఉంటుంది కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలో లేరని.. ఆయన పూర్తిగా సినిమాలకే అంకితమయ్యారని నాగబాబు చెబుతున్నారు. ఈ విషయంలో చిరంజీవి మనసు మార్చుకునే అవకాశం కూడా లేదంటున్నారు. గడిచిన ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానానికి పోటీచేసిన నాగబాబు 2.50 లక్షల ఓట్లను సాధించుకున్నారు.
మరోవైపు నాగబాబును అధినేత పవన్ కళ్యాణ్ కావాలనే ఎన్నికలకు దూరం పెట్టారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాగబాబులో దూకుడు స్వభావం ఎక్కువ. ముక్కుసూటి మనిషి కావడంతో నేరుగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అది కాస్తా మైనస్ గా మారుతోంది. పార్టీ ఆవిర్భవించి ఎనిమిదేళ్లవుతున్నా..ఆయన పార్టీకి చాలా వరకూ దూరంగా ఉంటూ వచ్చారు. అయినా గడిచిన ఎన్నికల ముందు పిలిచి మరీ నరసాపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ మూడో స్థానంలో నిలిచారు. ఆయన వ్యవహారశైలి .,. వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం అప్పట్లో వినిపించింది. ఈ సారి ఎందుకైనా మంచిదని ఆయన పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
Also Read:Pawan Kalyan Janasena: సంచలన సర్వే.. ఏపీలో జనసేన గెలుపునకు అదొక్కటి చేస్తే చాలు!
Recommended Videos