Nagababu Uttarandhra Tour: ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా బరిలోకి దిగడానికి జనసేన సిద్ధమవుతోంది. ఈక్రమంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీలో కీలక నేత నాగబాబు రంగంలోకి దిగారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పర్యటించి గ్రామస్థాయి నుంచి జనసేనను బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో నాగబాబు పర్యటనకు మంచి స్పందన వస్తోంది. జనసేన నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతంపై నాగబాబు కీలక సూచనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలంగా మార్చి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉందని తెలిపారు.
జనసేన పార్టీ గ్రామీణ స్థాయిలో బలంగా ఉన్నదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బలంగా బరిలోకి దిగేందుకు జనసైనికులు సిద్దంగా ఉన్నారని జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేసారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా బుధవారం శ్రీకాకుళంలో మీడియా ప్రతినిధులతో నాగబాబు గారు మాట్లాడారు.
Also Read: KA Paul- BJP- KCR: తెలంగాణలో కేసీఆర్ పైకి బీజేపీ విసురుతున్న అస్త్రం కేఏ పాల్.?
ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాత పట్నం, నర్సన్న పేట, ఆముదాలవలస, శ్రీకాకుళం, రాజాం, పాలకొండ, ఎడ్చెర్ల నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా, వార్డ్ మెంబర్లుగా పోటీ చేసి గెలుపొందిన ప్రజా ప్రతినిధులు, పోటీలో నిలిచిన వారితో మాట్లాడడం జరిగిందని అన్నారు.
జన సైనికులలో ఎక్కువ శాతం మేధావులు, విద్యావంతులు, ఐ.టీ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వారందరి ఆలోచన విధానం, మేధస్సు, పార్టీ గెలుపు కోసం వారు చేస్తున్న కృషి అమూల్యమైనది అని పేర్కొన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారు చేయడమే జనసేన పార్టీ ప్రధాన విధానమని, ఆ కోవలోనే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా జనసైనికులు పని చేస్తున్నారు అని అన్నారు.
Also Read:Nandamuri Mokshagna:నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమాకి డైరెక్టర్ ఫిక్స్