KGF 2: ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ తర్వాత బాక్సాఫీస్ ని బద్దలు చేసిన చిత్రం కెజిఎఫ్ 2. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఇక హిందీలో అయితే పెద్ద సంచలనం నమోదు చేసింది. దాదాపు రూ. 450 కోట్ల వసూళ్లు రాబట్టింది. అసలు బాహుబలి 2 రికార్డు కూడా బ్రేక్ చేస్తుందేమో అన్నట్లు కెజిఎఫ్ 2 జర్నీ సాగింది. ఏకంగా నాలుగు వారాలు సాలిడ్ కలెక్షన్స్ అందించింది.

ఇక థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు, రెండోసారి చూడాలని ఆశ పడ్డవారికి అమెజాన్ ప్రైమ్ ఝలక్ ఇచ్చింది. తన సబ్స్క్రైబర్స్ కూడా రెంటల్ చెల్లించి మూవీ చూసేలా కండీషన్ పెట్టింది. రూ. 199 చెల్లించి కెజిఎఫ్ 2 చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కెజిఎఫ్ 2 పై రెంటల్ తీసేసి ఫ్రీగా ప్రైమ్ చందాదారులకు మూవీ అందించనున్నారు. జూన్ 3 నుంచి కెజిఎఫ్ చాప్టర్ 2 ప్రైమ్ లో ఉచితంగా అందుబాటులోకి రానుంది. దీంతో కెజిఎఫ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Nandamuri Mokshagna:నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమాకి డైరెక్టర్ ఫిక్స్
2018 లో విడుదలైన కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా చాప్టర్ 2 తెరకెక్కింది. యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ బ్లాక్ బస్టర్ తెరకెక్కించారు. పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో మరింత భారీగా సీక్వెల్ రూపొందించారు. మేకర్స్ అంచనాలు తప్పకుండా మూవీ పెద్ద విజయం నమోదు చేసింది. ఇక కెజిఎఫ్ 3 కూడా ఉందంటూ నిర్మాతలు హింట్ ఇవ్వడం విశేషం. ఈ ఫ్రాంచైజ్ పై ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉన్న నేపథ్యంలో కెజిఎఫ్ 3 రావడం ఖాయంగా కనిపిస్తుంది.

అయితే దానికి చాలా సమయం పట్టే అవకాశం కలదు. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్న ప్రశాంత్ నీల్, ఆ తర్వాత ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి తీసుకెళతారు. సలార్ 2023 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అదే ఏడాది చివర్లో ఎన్టీఆర్ మూవీ షూటింగ్ మొదలు కావచ్చు.
Also Read:TDP Mahanadu 2022 Success: మహానాడు సక్సెస్ వెనుక జగన్..అదేలా అంటే?
Recommended Videos


