https://oktelugu.com/

Janasena: జగన్ ప్రసంగం పది నిమిషాలు కూడా జనాలు వినడం లేదు

Janasena: మొన్న రైతు సభలో ఏపీ సీఎం జగన్ ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ పై ఓ వైపు విమర్శల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు ఈ సభకు వచ్చిన జనాలు జగన్ ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. జగన్ ప్రసంగం రైతుల పై కాక పవన్ కళ్యాణ్ పై చేయడమే ఇలా జనాల తిరస్కారానికి కారణం అని గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే దీన్నే జనసేన ఎలుగెత్తి చాటుతోంది. ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది. రైతు భరోసా […]

Written By:
  • NARESH
  • , Updated On : May 17, 2022 / 07:23 PM IST
    Follow us on

    Janasena: మొన్న రైతు సభలో ఏపీ సీఎం జగన్ ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ పై ఓ వైపు విమర్శల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు ఈ సభకు వచ్చిన జనాలు జగన్ ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. జగన్ ప్రసంగం రైతుల పై కాక పవన్ కళ్యాణ్ పై చేయడమే ఇలా జనాల తిరస్కారానికి కారణం అని గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే దీన్నే జనసేన ఎలుగెత్తి చాటుతోంది. ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది.

    రైతు భరోసా పంపిణీ విషయంలో జరుగుతున్న మోసం ఏమిటీ అనేది ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లోనే తేటతెల్లం అవుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ అన్నారు. మంగళవారం ఆయన కాకినాడలో జనసేన పార్టీ గ్రామ సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ “2019-20 సంవత్సరానికి సంబంధించి ఇదే ప్రభుత్వం రైతు భరోసా కింద మొత్తం 64 లక్షల మంది రైతులకు, అలాగే 15 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు లెక్కల్లో చూపింది. మరి ఈ సంవత్సరం లెక్క 50 లక్షలకు పడిపోయింది. రైతుల సంఖ్య ఇలా ఎందుకు తగ్గిపోయింది జరిగింది అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకేసారి ఇన్ని లక్షల మంది రైతులు మాయమైపోయారా లేక ఏం జరిగింది అనేది ప్రభుత్వం ప్రజలకు వివరించాలి. ఇన్ని దొంగ లెక్కలు పెట్టుకుని.. కేంద్రం అందించే డబ్బుకు తన పేరు పెట్టుకొని రైతులకు పంచుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇతరులను విమర్శించడం మానాలి. మాటల్లోనే కాక లెక్కల్లో సైతం మోసం చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి రైతులకు సాయం చేసే గుణం లేదు. ఇలాంటి వ్యక్తి సొంత డబ్బులతో కౌలు రైతు కుటుంబాలకు సాయం చేస్తున్న శ్రీ పవన్ కల్యాణ్ గారి పేరు కూడా తలిచే అర్హత కోల్పోయారు. సీబీఐ దత్త పుత్రుడైన శ్రీ జగన్ రెడ్డికి దొంగ లెక్కలు చెప్పడం అలవాటైన పనే.

    * అక్కడ సభకు రాకుండా… ఇక్కడ సభ నుంచి బయటకు వెళ్లకుండా..
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. పోలీసులు పవన్ కళ్యాణ్ సభకు ప్రజలు వెళ్లకుండా అడ్డుకుంటే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్వహించే సభల నుంచి బయటకు వెళ్ళిపోకుండా అడ్డుకోవడం వారి పని అవుతుంది. ఇక్కడే స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. తమ కోసం కష్టపడుతున్న, పోరాడుతున్న తమ అభిమాన నాయకుడి ప్రసంగం వినడానికి ప్రజలు వస్తుంటే ఈ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. ప్రజలు పవన్ కళ్యాణ్ గారి సభకు రాకుండా అడ్డుకుంటున్నారు. మరో పక్క ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలకు ఏదోలా తీసుకువచ్చినా వారు ఆయన ప్రసంగం విని భయపడుతున్నారు. ముఖ్యమంత్రి సభకు వచ్చిన వారు నిమిషాల్లోనే వెళ్లిపోతుంటే వారిని పోలీసులతో ఆపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం సిగ్గుచేటు. ఇంతటి దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. పాలనపై పూర్తిగా పట్టు తప్పిన ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను ఏదో ఒకలా రెచ్చగొట్టడానికి నానారకాల మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏ నాయకుడు తమకోసం కష్టపడుతున్నాడు ఆలోచిస్తున్నాడు అన్నది వారు గుర్తిస్తున్నారు. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘోర పరాభవం తప్పదు” అన్నారు.