Honey Rose: నటసింహం బాలయ్య కోసం మరో మలయాళీ ముద్దుగుమ్మను పట్టుకొచ్చాడు గోపీచంద్ మలినేని. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. ‘హనీ రోజ్’. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ, పలు మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో కూడా ‘ఆలయం, ఈ వర్షం సాక్షిగా’ అనే చిత్రాల్లో హనీ రోజ్ నటించింది. ఇప్పుడు ఏకంగా బాలయ్యతో రొమాన్స్ చేయబోతుంది. ‘అన్నగారు’ టైటిల్ తో రాబోతున్న ఈ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఈమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందట.

మెయిన్ హీరోయిన్ గా నటిస్తోన్న శృతి హాసన్ ఓన్లీ ప్లాష్ బ్యాక్ లో మాత్రమే కనిపిస్తోంది. లైవ్ లో హనీ రోజ్ కే ఎక్కువ స్క్రీన్ స్పెస్ ఉంది. అందుకే, బాలయ్య కొత్త సినిమాలో మెయిన్ హీరోయిన్ ఇప్పుడు హనీ రోజ్ అనే టాక్ నడుస్తోంది. హనీ రోజ్ 2005లో ‘బాయ్ ఫ్రెండ్’ అనే సినిమాతో వెండితెర పై అరంగేట్రం చేసింది. ఆమె చేసిన సినిమాల విషయానికొస్తే.. స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి, జయరాం, సురేశ్ గోపి సరసన ఆడిపాడింది.
Also Read: పూర్ణ ఆ విషయంలో అసలు తగ్గేదే లే అంటుంది
ప్రస్తుతం బాలయ్య చిత్రంతో పాటు ‘పట్టామ్ పూచి’, ‘మాన్స్టర్’ సినిమాల్లోనూ హనీ రోజ్ నటిస్తోంది. నిజానికి గోపీచంద్ మలినేని ఈ రోల్ కోసం చాలామంది హీరోయిన్ల పేర్లనే పరిశీలించాడు. హనీ రోజ్ అయితే, బడ్జెట్ లో వస్తోంది. పైగా తను రాసుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేస్తోంది. గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా హనీ రోజ్ లో మ్యాటర్ ఉంది. అందుకే, ఆమెను ఫైనల్ చేశాడు గోపీచంద్ మలినేని.

మరి, బాలయ్య సినిమా హిట్ అయితే, టాలీవుడ్ కి మరో సాలిడ్ హీరోయిన్ దొరికినట్టే. ఈ సినిమా కోసం ఆమె ఇప్పటికే బల్క్ డేట్లు ఇచ్చింది. ఎప్పటి నుంచో బాలయ్యకి సరైన హీరోయిన్ దొరకడం లేదు. కానీ, హనీ రోజ్ లుక్ చూస్తుంటే.. ఈ దశాబ్దంలోనే బాలయ్యకి సరైన జోడి అనిపిస్తోంది. మరి ఈ కలయిక ఎలా ఉండబోతుందో చూడాలి.
యథార్థ సంఘటనల ఆధారంగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నారు.
Also Read:Mahesh- Trivikram: మహేష్ – త్రివిక్రమ్ సినిమా పై ఇంట్రెస్టింగ్ సంగతులు
Recommended Videos


