Nagababu: వైసీపీ పాలన దుర్మార్గమైనదని.. ఇప్పటికే ప్రజలు ఎన్నుకొని తప్పు చేశారని.. మరోసాని జగన్ ఏపీలో అధికారంలోకి వస్తే ఏపీ నుంచి కాందీశీకులు లాగా పక్క రాష్ట్రాలకు వలస పోతారని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లుగా రాజధాని లేకుండా పరిపాలిస్తున్న ఏకైక సీఎం జగన్ అని నాగబాబు ఎద్దేవా చేశారు.రైతులు, జనసేన పోరాటం ఫలించి అమరావతియే రాజధానిగా హైకోర్టు ప్రకటించిందని.. ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు.
ఏపీలో ప్రతి పౌరుడిపై లక్ష రూపాయల అప్పు ఉందని.. ఇక తాగడానికి ‘గోల్డ్ మెడల్ ’ బ్రాండ్లు ఉన్నాయని నాగబాబు నిప్పులు చెరిగారు. ఏపీలో జగన్ పాలన చూసి ఇప్పుడు అందరూ ఆందోళన చెందుతున్నారని.. ఎందుకు గెలిపించామని బాధపడుతున్నారని నాగబాబు విమర్శించారు.
Also Read: Pawan Kalyan Target: పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా? కీలక ప్రకటనకు రంగం సిద్ధం!
జగన్ అధికారంలోకి వచ్చాక అప్పులు, తిప్పలు, కష్టాలు, కడగండ్లు మాత్రమే ఉన్నాయని.. అవి మరిచిపోవడానికి కొత్త రకం బ్రాండ్లు అమ్ముతున్నారని నాగబాబు విమర్శించారు. అప్పులపాలైన ఏపీపై మరింత అప్పులు చేస్తూ వైసీపీ సర్కార్ పెను భారం మోపుతున్నారని ఆరోపించారు.
Also Read: Ganta Srinivasarao: రాజీనామా కోసం గంటా పట్టు.. జనసేనలోకి జంపింగా?
ఇక ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని.. నేను ప్రయాణిస్తే వెన్నుపూస కదిలిందని నాగబాబు అన్నారు. ఏపీ ప్రజలను ఇతర రాష్ట్రాలకు వెళితే జాలీగా చూస్తారని ఆరోపించారు. జగన్ పాలనలో మంత్రులకు పని లేదని.. వారు ఏం చేయాలో తోచక ఫోన్లలో ఆవేదన వ్యక్తం చేస్తూ దొరికిపోతున్నారని నాగబాబు అన్నారు.