https://oktelugu.com/

Pawan Kalyan Narasapuram: పవన్ కళ్యాణ్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

Pawan Kalyan Narasapuram: జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలోని నర్సాపురంలో పర్యటించారు. సినిమాలతో బిజీగా ఉంటూనే రాజకీయాలకు సమయం కేటాయిస్తున్నారు. అధికార వైసీపీ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నారు. ప్రజల పక్షాన నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారుల తరుఫున పోరాటానికి కూడా సిద్ధమయ్యారు. వారి ఆవేదనను ఎలుగెత్తి చాటడానికి రెడీ అయ్యారు. నర్సాపురం వేదికగా జరుగుతున్న ఈ మత్స్యకార సభలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ రాకతో అభిమానులు హంగామా అంతా ఇంతాకాదు.. జనసేన కార్యకర్తలు కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 20, 2022 / 06:50 PM IST
    Follow us on

    Pawan Kalyan Narasapuram: జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలోని నర్సాపురంలో పర్యటించారు. సినిమాలతో బిజీగా ఉంటూనే రాజకీయాలకు సమయం కేటాయిస్తున్నారు. అధికార వైసీపీ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నారు. ప్రజల పక్షాన నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారుల తరుఫున పోరాటానికి కూడా సిద్ధమయ్యారు. వారి ఆవేదనను ఎలుగెత్తి చాటడానికి రెడీ అయ్యారు. నర్సాపురం వేదికగా జరుగుతున్న ఈ మత్స్యకార సభలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు.

    పవన్ రాకతో అభిమానులు హంగామా అంతా ఇంతాకాదు.. జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ సభకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అంటూ గోల చేశారు. ఆ సమయంలో ఓ అభిమాని పవన్ కాళ్లమొక్కడానికి చేతిలో చేయి వేసి ఆశీర్వాదం తీసుకోవడానికి పవన్ వద్దకు పరుగున వచ్చాడు. కారుపైన నిలుచున్న పవన్ ను ఆ స్పీడులో తాకడంతో పవన్ కింద పడిపోయాడు. పవన్ బాడీగార్డ్ అభిమానిని కిందకు లాగడంతో పవన్ కూడా కింద పడ్డాడు. మళ్లీ వెంటనే లేచి నిల్చొని ముందుకు సాగాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

    ఈ హఠాత్ పరిణామంతో పవన్ కళ్యాణ్ కారుపైనే జారిపడిపోయాడు. పవన్ కళ్యాణ్ కాసేపు కారుపైనే కూర్చుండిపోయారు. తర్వాత నవ్వుకుంటూ పైకి లేచి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న 217 జీవోపై గళం ఎత్తడానికి పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభ చేపట్టారు. మత్య్సకారుల సమస్యల పరిష్కారం పోరాటం చేస్తూ ఆదివారం నరసాపురంలో నిర్వహించిన ఈ సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.