Janasena- Gudivada Amarnath: ఏపీ కేబినెట్ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ కు జనసేన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం వైసీపీ మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన పేరిట భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకుంటున్న నేపథ్యంలో వైసీపీ కీలక ప్రజాప్రతినిధులు విరుద్ధ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అయితే దీనికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఎందుకీ గర్జనల పేరుతో గర్జించారు.దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. పవన్ పై తమకు అలవాటుగా మారిన వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్నారు. పవన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక..తమ లేకితనాన్ని బయటపెట్టుకుంటున్నారు.

ఎప్పుడు పవన్ అంటే నోరు పారేసుకునే గుడివాడ అమర్నాథ్ కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు. ఎప్పుడో నెలల కిందట కన్ఫర్మ్ అయిన జనసేన జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. పవన్ ను విశాఖ రాకుండా అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ నెల 16న జనవాణి కార్యక్రమ నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 15న విశాఖకు పవన్ రానున్నాయి. అయితే పవన్ వస్తే విశాఖ గర్జన ఫెయిలవుతుందని భావిస్తున్న వైసీపీ నేతలు…ఆయన్ను అడ్డుకునే ప్రయత్నంచేస్తున్నారు. ఇందుకు కుంటిసాకులు వెతుకుతున్నారు. మంత్రి అమర్నాథ్ ఒక అడుగు ముందుకేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ ను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడుతున్నారు.

అయితే దీనిపై జన సైనికులు కూడా దీటుగా రియాక్టవుతున్నారు. గుడివాడ అమర్నాథ్ కు నేరుగా హెచ్చరికలు పంపుతున్నారు. జనసేన జనవాణికి హాజరై మీ సమస్యలు చెప్పుకోండి పరిష్కరిస్తామని సవాల్ విసురుతున్నారు.కార్యక్రమానికి వస్తే చీర, సారెతో సాగనంపుతామని కూడా షటైర్లు వేస్తున్నారు. గతంలో కూడా పవన్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించి అమర్నాథ్ కు జనసైనికులు దీటైన కౌంటరే ఇచ్చారు. శవయాత్ర చేసి చూపించారు. వేలాదిగా హాజరైన జనసైనికులు పాడె కట్టి అంతిమ యాత్ర నిర్వహించారు. ఇప్పుడు మరోసారి అటువంటి సవాలే చేశారు. జనసేన జనవాణి కార్యక్రమానికి హాజరై దమ్ము నిరూపించుకోవాలని ..తగిన మర్యాదచేసి పంపిస్తామని కూడా గౌరవంగా గౌరవ మంత్రికి ఆహ్వానాలు పంపుతున్నారు. మరి దీనిపై అమర్నాథ్ ఎలా రియాక్టవుతారో చూడాలి మరీ.