Naga babu vs Roja: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీలో బలమైన అభ్యర్థులను ఆయన టార్గెట్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని రాజకీయగా దెబ్బకొట్టాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం వైసీపీలో ఉన్న కొంతమంది బలమైన నేతలను గుర్తించారు. వచే ్చ ఎన్నికల్లో వీరిని ఓడించడం ద్వారా పార్టీని దెబ్బతీయొచ్చని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జనసేనాని ముందుగా గుడవాడ ఎమ్మెల్యే కొడాలి నాని, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజాను టార్గెట్ చేశారు.

వారిద్దరే ఎందుకు?
పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన జాబితాలో పది మందికి పైగా వైసీపీ నేతలు ఉన్నారు. కానీ.. ఫస్ట్ టార్గెట్ మాత్రం కొడాలి నాని, ఆర్కే రోజాను మాత్రమే నిర్ణయించుకున్నారు. వైసీపీలో జగన్ తర్వాత అంత దూకుడుగా ప్రతిపక్షాలను ఎదుర్కొగల సత్తా, వాక్‌చాతుర్యం, ఆర్థిక బలం ఉన్న నేత కొడాలి నాని. ఆయనను దెబ్బతీయడం ద్వారా పార్టీకి ఆర్థికంగానూ, ఇటు విమర్శల పరంగానూ నాని నోరు మూయించవచ్చని జనసేనాని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్ టార్గెట్‌గా నానిని పవన్ పెట్టుకున్నారని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ కూడా నానినే లక్ష్యంగా చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో నానిని ఓడించడంతోపాటు తాము అధికారంలోకి వచ్చాక ప్రతీకారం కూడా తీర్చుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే ఉమ్మడి శత్రువు నాని అవుతారు.
ఇక వైసీపీ మహిళా నేతల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నాయకురాలు రోజా. వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయురాలు. జగన్ మీదగానీ, వైస్ కుటుంబం మీదగానీ ఎలాంటి విమర్శ వచ్చినా మొదట స్పందించే మహిళా నేత రోజా. పార్టీలతో సంబంధం లేకుండా, నాయకుల హోదాతో పని లేకుండా అందరినీ కడిగిపారేసే సత్తా ఆమెకు ఉంది. చంద్రబాబు, లోకేష్, బాలయ్య, పవన్ కళ్యాణ్‌తోపాటు అందరి విమర్శలనూ రోజా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఈ నేపథ్యంలో ఆమెను కూడా ఎన్నికల్లో ఓడించడం ద్వారా వైసీపీని దెబ్బతీయాలని జనసేనాని ఉన్నారు.
పవన్‌పైకి రోజా అస్త్రం..!
ఇప్పుడు రాజకీయంగా చంద్రబాబుతో పాటుగా పవన్‌ను వైసీపీ రాజకీయ ప్రత్యర్ధిగా భావిస్తోంది. పవన్ తన ఓట్ల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తెచ్చి తమను ఓడించేందుకే పవన్ రంగంలోకి దిగారని వైసీపీ భావిస్తోంది. ఈమేరకు చంద్రబాబు..వపన్ మధ్య ఒప్పందం ఉందంటూ జగన్ సైతం చెబుతూ వస్తున్నారు. ఇక, పవన్ పోటీ చేసే భీమవరం.. విశాఖలోని గాజువాక నియోజకవర్గాల్లో రోజాను ప్రచారంలోకి దింపాలని వైíసీపీ ఇప్పటికే నిర్ణయించింది.

నగరి బరిలో మెగా బ్రదర్..
వైసీసీ వ్యూహానికి జనసేనాని ప్రతివ్యూహం పన్నారు. రోజా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రి. ఆమెపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. నగరిలో రోజాకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు వైసీపీ నేతలు. తాను ఓడిపోతే.. సొంత పార్టీ నేతలే కారణం అవుతారని రోజా ఇటీవల వ్యాఖ్యానించారు కూడా. ఈ నేపథ్యంలో రోజాను ఓడించేందుకు పవన్ మాస్టర్ ప్లాన్ వేశారు. నగరి బరి నుంచి జనసేన తరఫున మెగా బ్రదర్ నాగబాబును వచ్చే ఎన్నికల్లో నిలపాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి లోకసభకు పోటీ చేసిన నాగబాబు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో జన సేనాని కూడా ఆయనకు సరైన స్థానం కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో నగరి అయితేనే నాగబాబుకు అన్ని విధాలా సరిపోతుందని భావిస్తున్నారు. ఈమేరకు మేగా బ్రదర్ కూడా అంగీకరించినట్లు తెలిసింది.