Jamili Elections : దేశంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party). 2014, 2019, 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టింది. అటు చాలా రాష్ట్రాల్లో సైతం రాగలిగింది. ఇంకొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారాన్ని పంచుకుంటుంది. ఎలా చూసినా బిజెపి బలమైన శక్తిగా ఉంది. అందుకే ఈ శక్తిని పదిల పరుచుకునేందుకు బిజెపి సరికొత్త ప్రయోగం ‘జమిలి’ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మాట చాలా రోజులుగా వినిపిస్తోంది. తెర వెనుక కార్యాచరణ జరుగుతోంది. అయితే తాజా పరిస్థితులను చూస్తుంటే మాత్రం బిజెపి జమిలి వైపేనని తేలిపోతోంది.
Also Read : దేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం.. జాతీయ పార్టీలకు లాభం.. ప్రాంతీయ పార్టీలు ఔట్
* సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో..
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి ఆశించిన ఫలితాలు రాలేదు. బిజెపి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని అంతా అంచనా వేశారు. కానీ జనాలు అవకాశం ఇవ్వలేదు. మ్యాజిక్ ఫిగర్ కు 40 సీట్లు దూరంగా బిజెపి ఉండిపోయింది. అటువంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీతో( Telugu Desam Party) పాటు నితీష్ పార్టీ అండగా నిలిచింది. అప్పుడే జమిలీ ఎన్నికల ఆలోచనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. జమ్మూ కాశ్మీర్ తో పాటు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురయ్యేసరికి జమిలి అంశం పక్కన పెట్టింది బిజెపి.
* ఆ రెండు రాష్ట్రాల విజయంతో..
అయితే తర్వాత మహారాష్ట్ర( Maharashtra), 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బిజెపి అధికారంలోకి రావడంతో జమిలిపై కదలిక వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బిజెపి భావిస్తోంది. తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉన్న రికార్డులను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడు బిజెపి పరిస్థితి బాగుంది. ఆ పార్టీపై పాజిటివ్ ప్రచారం ఉంది. అందుకే ఇటువంటి సమయంలో జమిలి ఎన్నికల ద్వారా అనుకున్నది సాధించాలని చూస్తోంది. ఇప్పటికే జమిలి బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. ఆరు నెలల పాటు అధ్యయనం కూడా ముగిసింది. బిజెపి పాలిత రాష్ట్రాలే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో బలమైన మిత్రపక్షాలు కూడా కొనసాగుతున్నాయి. అందుకే జమిలీపై ఏకాభిప్రాయానికి వచ్చి.. ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతోంది బీజేపీ. మరి కాషాయ దళం ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
* భాగస్వామ్య పక్షాలు సైతం..
ప్రస్తుతం కేంద్రంలో పాలుపంచుకుంటున్న కీలక నేత చంద్రబాబు( Chandrababu) సైతం జమిలి కి జై కొట్టారు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే ఖర్చు ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. ఇది దేశానికి అవసరం కూడా అన్నారు. మరోవైపు బీహార్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అక్కడ ఎన్డిఏ భాగస్వామ్య పక్షం అధికారంలో ఉంది. ఆ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జమిలి జరిగితే తప్పకుండా సీఎం నితీష్ కుమార్ ఆహ్వానిస్తారు. అయితే ఈ విషయంలో పక్కా ఆలోచనతో అడుగులు వేస్తోంది భారతీయ జనతా పార్టీ. జమిలి ద్వారా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తోంది.
Also Read : సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలుకుతూ మోదీ ట్వీట్ వైరల్!