https://oktelugu.com/

Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే… మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న ‘ఖిలాడీ’ మూవీ నుంచి ఐదో సింగిల్ నేడు రిలీజ్ కానుంది. సాయంత్రం 5.04 గంటలకు ‘క్యాచ్ మీ’ అంటూ సాగే సాంగ్‌ విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 11న రిలీజ్ కానుంది. ఇక మరో అప్ డేట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 5, 2022 / 03:08 PM IST
    Follow us on

    Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే… మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న ‘ఖిలాడీ’ మూవీ నుంచి ఐదో సింగిల్ నేడు రిలీజ్ కానుంది. సాయంత్రం 5.04 గంటలకు ‘క్యాచ్ మీ’ అంటూ సాగే సాంగ్‌ విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 11న రిలీజ్ కానుంది.

    Ravi Teja

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. అలియా భట్ ప్రస్తుతం దేశంలోని అగ్ర హీరోయిన్. ఆమె కొత్త చిత్రం గంగూబాయి ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘తన కుటుంబం మొత్తం పుష్ప సినిమాను ఇంట్లో చూసిందని, తమ ఫ్యామిలీ అల్లు అర్జున్ నటనను బాగా ఇష్టపడిందని అలియా వెల్లడించింది. అయితే, బన్నీతో ఎప్పుడు సినిమా చేస్తారు అని యాంకర్ అడిగినప్పుడు, అలియా కొంచెం ఆలోచించి.. బన్నీతో రొమాన్స్ చేయడానికి ఖచ్చితంగా ఇష్టపడతాను అని చెప్పింది.

    Also Read:  హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో జాబ్స్.. నెలకు రూ.లక్ష వేతనంతో?

     

    alia bhatt

    అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్‌ రాజు ఇప్పుడు ఓటీటీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ హరీష్ శంకర్‌ తో కలసి ‘ఏటీఎమ్’ అనే రాబరీ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ను ప్లాన్‌ చేస్తున్నాడు. దీనికి హరీష్‌ కథను అందిస్తుండగా చంద్రమోహన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. జీ5 సంస్థతో కలిసి ఈ సిరీస్‌ను నిర్మించనున్నట్లు దిల్‌రాజు, హరీష్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా స్టార్టింగ్ అయింది.

    Also Read: పాలన అంటే కేజ్రీవాల్‌దే.. అప్పు లేని రాష్ట్రంగా ఢిల్లీ..!

    Tags