spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: పంచాయ‌తీల నోటికాడి బుక్క‌ను లాగేసుకున్న జ‌గ‌న్‌.. ఏంట‌య్యా ఇది..?

CM Jagan: పంచాయ‌తీల నోటికాడి బుక్క‌ను లాగేసుకున్న జ‌గ‌న్‌.. ఏంట‌య్యా ఇది..?

CM Jagan: ఏపీలో ప‌రిస్థితులు చూస్తుంటే.. అమ్మ పెట్ట‌దు. అడుక్క తిన‌నివ్వ‌దు అన్న‌ట్టే ఉంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అభివృద్ధిని పూర్తిగా మ‌ర్చిపోయింది. పైగా ఎక్క‌డ ఏం నిధులు దొరుకుతాయా.. లాగేసుకుందామా అని మిగ‌తా సంస్థ‌ల‌పై ప‌డుతోంది. ఇప్ప‌టికే కార్పొరేష‌న్ల‌కు ఎలాంటి నిధులు ఇవ్వ‌ట్లేదు. ఇప్పుడు పంచాయ‌తీపై ప‌డిపోయింది.

CM Jagan
CM Jagan

ఎవ‌రైనా పండ‌గ‌కు బోన‌స్ ఇస్తారు గానీ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం పండ‌గ‌రోజే ఉన్న కాసిన్ని డ‌బ్బులు కూడా లాగేసుకుంటోంది. ఏమ‌న్నా అంటే త‌న‌కున్న విచ‌క్ష‌ణా అధికారం అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. మ‌నం సినిమాల్లో కొన్ని సీన్ల‌ను త‌ర‌చూ చూస్తుంటాం. ప్ర‌జలు రోజంతా క‌ష్ట‌ప‌డి డ‌బ్బులు కూడ‌బెట్టుకుంటే.. టైమ్‌కు వ‌చ్చి రౌడీలు మామూలు రూపంలో వ‌సూలు చేసుకుపోయిన‌ట్టు.. ఇప్పుడు పంచాయ‌తీల ప‌రిస్థితి కూడా ఇలాగే త‌యారైంది.

Also Read: Governor Tamilisai: గవర్నర్ కు షాక్: ఉగాది వేడుకకు హాజరు కాని సీఎం, మంత్రులు.. తగ్గేదేలే అంటున్న తమిళిసై

ఇప్ప‌టికే పంచాయ‌తీల‌కు ఆయా ఆర్థిక సంఘాల నుంచి వ‌స్తున్న నిధులను మ‌ళ్లించేసుకుంటున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఇప్పుడు పంచాయ‌తీల‌కు ఇంటిప‌న్ను, చెత్త‌ప‌న్ను రూపంలో వ‌చ్చిన కాసిన్ని నిధుల‌ను కూడా మ‌ళ్లించేసుకుంది. దీంతో ఉగాది వేళ పంచాయ‌తీల‌కు పెద్ద షాక్ త‌గిలింది. పంచాయ‌తీ ఖాతాల్లో ఉన్న నిధులను తన‌కున్న విచ‌క్ష‌నా అధికారంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం లాగేసుకోవ‌డంతో స‌ర్పంచులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఎందుకంటే ఇప్ప‌టికే పంచాయ‌తీల‌కు ఎలాంటి నిధులు ఇవ్వ‌ట్లేదు. పైగా పంచాయ‌తీల్లో చేసిన కొద్దిపాటి ప‌నుల‌కు కూడా బిల్లులు ఇవ్వ‌ట్లేదు. అవి ప‌క్క‌న పెట్టేసి తాము క‌ష్ట‌ప‌డి వ‌సూలు చేసుకున్న ప‌న్నుల నిధుల‌ను కూడా లాగేసుకోవ‌డం ఏంటంటూ మండిప‌డుతున్నారు. నోటికాడి బుక్క‌ను లాక్కోవ‌డం అంటే ఇదే కదా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

CM Jagan
CM YS Jagan

వాస్త‌వానికి ఈ నిధుల‌తోనే పంచాయ‌తీల ప‌రిధిలోని మ‌ర‌మ్మ‌తులు, తాగునీటి స‌ర‌ఫ‌రా, పారిశుధ్య ప‌నుల లాంటివి చేయాల్సి ఉంటుంది. పైగా పంచాయ‌తీ కార్మికుల‌కు అందులో నుంచి డ‌బ్బులు ఇవ్వాలి. మ‌రి ఇప్పుడు ప్ర‌భుత్వం ఉన్న నిధులు తీసుకుంటే.. పంచాయ‌తీ నిర్వ‌హ‌ణ ఎలా అంటూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Also Read: India- America: అమెరికా బెదిరింపులను భారత్ లెక్కచేయడం లేదా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper