Homeఎంటర్టైన్మెంట్Tollywood Heros Real Names: ఈ హీరోల పేర్లు ఇవి కావు.. అసలు పేర్లు ఇవిగో..

Tollywood Heros Real Names: ఈ హీరోల పేర్లు ఇవి కావు.. అసలు పేర్లు ఇవిగో..

Tollywood Heros Real Names: కొందరికి చాంతాడంతా పేర్లు ఉంటాయి. వారి జాతకం ప్రకారంగానో.. లేక వారి తల్లిదండ్రుల పేరో.. తమ పిల్లలకు పెట్టుకుంటారు. అయితే వారిని ఈజీగా పిలిచేందుకు కొందరు నిక్ నేమ్ లు పెట్టుకుంటారు. అసలు పేర్లను సర్టిఫికెట్లలో మాత్రమే ఉంచుతారు. నిక్ నేమ్ తోని చాలా మంది ఫేమస్ అవుతారు. వారి జీవితాంతం ఆ నిక్ నేమే అసలు పేరుగా నానుతుంది. అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా కొందరు హీరోలు నిక్ నేమ్ పెట్టుకొని ఫేమస్ అయ్యారు. వారి అసలు పేర్లు చాలా మందికి తెలియదు. ఒకవేళ అసలు పేర్లు చెప్పినా గుర్తుపట్టని పరిస్థి ఉంది. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ కృష్ణ..పవర్ స్టార్ పవన్ కల్యాణ్.ల గురించి అందరికీ తెలుసు. వారి ఫేస్ లు చూడగానే ముందుగా ఈ పేర్లతోనే మాట్లాడుకుంటారు. కానీ వీరితో పాటు కొందరు నటులకు రియల్ నేమ్స్ ఉన్నాయి. కొందరు అసలు పేర్లను షార్ట్ చేసి పిలుచుకుంటే.. మరికొందరు కొత్త నేమ్ ను తగిలించుకొని ఫేమస్ అయ్యారు.

Tollywood Hero Original Names
Tollywood Hero Original Names

మెగాస్టార్ చిరంజీవి: స్వయం కృషితో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. సినిమాల్లోకి వచ్చాక ఆయన పేరు చిరంజీవిగా మారింది. చిరంజీవిగా పేరు మార్చుకున్న తరువాత ఆయనకు కలిసొచ్చింది. అప్పటి నుంచి ఈయన సక్సెస్ లైఫ్ ను కొనసాగిస్తూ వస్తున్నారు.

Konidela Siva Sankara Vara Prasad
Konidela Siva Sankara Vara Prasad

సూపర్ స్టార్ కృష్ణ: అలనాటి హీరోల్లోఒకరైన కృష్ణ నటనకు ఓల్డ్ ఫ్యాన్స్ ఫిదా అవుతారు. ఆయన కుమారుడు మహేశ్ స్టార్ హీరో. మరో కుమారుడు నరేశ్, ఇతరులు కూడా సినిమాల్లోనే ఉన్నారు. యాక్షన్ కింగ్ గా కృష్ణ అనేక సినిమాల్లో నటించారు. ఫ్యామిలీ మూవీస్ తో పాటు డిఫరెంట్ రోల్ లో నటించిన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరమాకృష్ణ. ఆయన పేరు పెద్దగా ఉండడంతో కొందరు కృష్ణ అని పిలిచేవారట. అలా కృష్ణ సూపర్ స్టార్ కృష్ట అయ్యారు. విజయవంతమైన ఎన్నో సినిమాల్లో నటించారు.

Siva Rama Krishna Ghattamaneni
Siva Rama Krishna Ghattamaneni

పవర్ స్టార్ పవన్ కల్యాణ్: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడైన పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక.. వరుసహిట్లు కొట్టాడు. డైనమిక్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న పవన్ సినిమాలంటే క్రేజ్ ఉన్న ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్లో పవన్ కల్యాణ్ ను కళ్యాణ్ బాబు అని పిలిచే వారు. రాను రాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గా మారిపోయారు.

Konidela Kalyan Babu
Konidela Kalyan Babu

నాని: ఎలంటి సినీ బ్యాక్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ‘అష్టా చమ్మ’ సినిమాతో హీరోగా మారి ‘అలా మొదలైంది’ సినిమాతో స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు.సినిమాల్లో అందరికీ నానిగా తెలిసినా ఆయన అసలు పేరు ఘంటా నవీన్ బాబు.

Naveen Babu Ghanta
Naveen Babu Ghanta

ప్రభాస్: ‘ఈశ్వర్’ సినిమాతో ఫిల్మ్ నగర్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ‘బాహుబలి’తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకటసత్యనారాయణ ప్రభాస్ రాజు.

Prabhas Original Name
Venkata Satyanarayana Prabhas Raju Uppalapati

ఇలాగే మరికొందరి హీరోల స్క్రీన్- రియల్ పేర్లు:

రజనీకాంత్ -శివాజీరావ్ గైక్వాడ్

మోహన్ బాబు-భక్తవత్సలనాయుడు

కమల్ హసన్-పార్థసారధి శ్రీనివాసన్

రవితేజ-భూపతిరాజు రవి శంకర్ రాజు

జగపతిబాబు-వీరమాచినేని జగపతిరావు

సునీల్-సునీల్ వర్మ

మమ్ముట్టి- మహమ్మద్ కుట్టి పని పరంబాల్ ఇస్మాయిల్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular