CM Jagan: వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు గుంటూరులో జరిగిన ప్లీనరీలో ఈ మేరకు తీర్మానం చేశారు. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జగన్ వైసీపీకి గుండెకాయలా మారనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని దశదిశలా వ్యాపింపజేసేందుకు తన శాయిశక్తులా కృషి చేసేందుకు సిద్ధమయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చాలని భావిస్తున్నారు. దీనికి గాను కావాల్సిన వ్యూహాలను కూడా ఖరారు చేస్తున్నారు.

వైసీపీకి గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ రాజీనామా చేసినా తాను పార్టీని గాడిలో పెడతానని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెబుతున్నారు. దేవుడి దయ వల్లే పార్టీకి ఇంతటి ప్రాధాన్యం వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో ఇప్పుడు అవి కూడా అంతే స్థాయిలో కష్టపడుతున్నాయని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా గడ్డు పరిస్థితులే ప్రతిపక్షాలకు రావడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.
Also Read: Pawan Kalyan Cartoon Fight: ఏపీ సీఎం జగన్ పై ‘నయా’ వార్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్
దాదాపు దశాబ్ద కాలం పాటు వైసీపీ ఎన్నో కష్టలు అనుభవించింది. ప్రస్తుతం ఆ కష్టాలు ప్రతిపక్షాలు అనుభవిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి రానీయకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ భగవంతుడు మన పాలిట అండగా ఉంటే వారేం చేస్తారని చెప్పారు. ముందు ముందు కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే అన్ని ప్రయత్నాలు చేస్తాం. రెండోసారి అధికారం చేజిక్కించుకోవడమే ధ్యేయంగా ముందుకు కదులుతాం. ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం మాదే. చివరకు తామే అధికారంలోకి వస్తామంటూ జగన్ భరోసా వ్యక్తం చేశారు.

ప్రజలకు మంచి చేస్తున్నామనే ఉద్దేశంతో వారు మనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది అలాగే కొనసాగాలి. ప్రతిపక్షాలు ఎన్ని దారుల్లో వచ్చినా అంతిమంగా మనదే విజయబాట అవుతుంది. అందుకు అన్ని మార్గాలు అనుసరిస్తాం. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతాం. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోం. చరిత్ర పునరావృతం చేసేందుకే నిర్ణయించుకున్నాం. దీనికి ఎవరు అడ్డు తగిలినా సరే వారే పక్కకు వెళతారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా అడ్డంకులు సృష్టించినా ప్రజల దీవెనలు ఉన్నంత కాలం మాకు ఏమీ కాదని చెబుతున్నారు.
Also Read:Venu Udugula: టాలెంటెడ్ డైరెక్టర్ కష్టాలు.. ఒక్క ప్లాప్ తోనే అప్పుల్లో మునిగిపోయాడు
[…] […]