కరోనాపై మరో షాకింగ్ న్యూస్.. ఆ అవయవానికి ప్రమాదం..?

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో మళ్లీ 40,000కు పైగా కరోనా కేసులు నమోదు కాగా లాక్ డౌన్ అమలు చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. కరోనా మహమ్మారి విజృంభించిన కొత్తలో ఈ వైరస్ వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని చాలామంది భావించారు. శాస్త్రవేత్తలు, వైద్యులు సైతం ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. Also […]

Written By: Navya, Updated On : March 19, 2021 1:19 pm
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో మళ్లీ 40,000కు పైగా కరోనా కేసులు నమోదు కాగా లాక్ డౌన్ అమలు చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. కరోనా మహమ్మారి విజృంభించిన కొత్తలో ఈ వైరస్ వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని చాలామంది భావించారు. శాస్త్రవేత్తలు, వైద్యులు సైతం ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.

Also Read: ఆ ప్రాంతంలో మరోసారి లాక్ డౌన్.. మార్చి 31 వరకు పాఠశాలలు మూసివేత..!

అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన తరుణంలో కరోనా మహమ్మారికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ బారిన పడితే కిడ్నీలు దెబ్బ తింటున్నాయని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా బారిన పడిన వ్యక్తుల్లో వైద్యులు, శాస్త్రవేత్తలు కిడ్నీలకు గాయం కావడం, కిడ్నీ దెబ్బ తినడం గుర్తించారు. ఈ విధంగా కిడ్నీ ఫెయిల్ కావడాన్ని ఎఆర్ఎఫ్ పేరుతో పిలుస్తారు.

Also Read: ఒకే డోసుతో కరోనా ఖతం..

కిడ్నీలు దెబ్బతింటే ఆ ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపై కూడా పడుతుంది. ఢిల్లీకి చెందిన డాక్టర్ దీపక్ కల్రా కరోనాతో ఆస్పత్రిలో చేరిన వారిలో 10 నుంచి 20 మంది కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధ పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యతో బాధ పడేవారిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ కిడ్నీ ఫెయిల్యూర్ లో బాధ పడేవాళ్లలో 72 శాతం మంది మరణించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్

కరోనా వైరస్ శరీరంలోని అవయవాలతో పాటు ఇమ్యూనిటీ పవర్ పై దాడి చేస్తుంది. సీనియర్ కన్సల్టెంట్ డయాలసిస్ విభాగం చీఫ్ రాజేష్ అగర్వాల్ వైరస్ వల్ల సంక్రమించే ఈ వ్యాధి ప్రభావం శరీరంపై తీవ్రంగా ఉంటుందని తెలిపారు.