Chandrababu IT Notice: బాబు గారికి కవితే ధైర్యం

లిక్కర్ స్కామ్ లో కేంద్ర ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. ఏకంగా ఢిల్లీ మంత్రిని అరెస్టు చేసింది. అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రముఖుల పేర్లు బలంగా వినిపించాయి.

Written By: Dharma, Updated On : September 4, 2023 12:14 pm

Chandrababu IT Notice

Follow us on

Chandrababu IT Notice: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా వినిపించిన పేరు కవిత. ఆమె కెసిఆర్ కుమార్తె కావడం.. బిజెపికి ప్రధాన ప్రత్యర్థిగా బీర్ ఎస్ ఉండడం.. సిబిఐ, ఈడి దూకుడు మీద ఉండడంతో కవిత అరెస్టు తప్పదని అంతా భావించారు. కానీ ఈ కేసులో హడావిడే తప్ప కవితను అరెస్టు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు చంద్రబాబు ఐటీ కేసు కూడా అదే రిపీట్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

లిక్కర్ స్కామ్ లో కేంద్ర ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. ఏకంగా ఢిల్లీ మంత్రిని అరెస్టు చేసింది. అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రముఖుల పేర్లు బలంగా వినిపించాయి. కవితకు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. రెండుసార్లు కార్యాలయానికి పిలిచి విచారణ చేపట్టారు. దీంతో ఆమె అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరిగింది. అదిగో అరెస్ట్.. ఇదిగో అరెస్ట్ అంటూ కాలయాపనే మిగిలింది తప్ప.. అరెస్టు చేసిన దాఖలాలు లేవు. గత కొద్దిరోజులుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు.

ఇప్పుడు చంద్రబాబుకు ఐటి నోటీసులు ఇచ్చింది. గత కొద్ది రోజులుగా హడావుడి నడుస్తోంది. చంద్రబాబుపై పట్టు బిగించడం ఖాయమని సాక్షి మీడియాలో పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. కానీ తెలంగాణ మాదిరిగా.. ఏపీ బీజేపీ నాయకులు ఈ కేసు గురించి అసలు మాట్లాడడమే లేదు. కనీసం తెలంగాణలో లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర గురించి అక్కడి బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. దీంతో ఈ కేసు నీరుగారి పోయే కేసుల జాబితాలో ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

గత తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో చూసుకుంటే దేశవ్యాప్తంగా పెద్ద నేతలను ఎవ్వర్నీ టచ్ చేయలేదు. కేసులు వరకు అయితే ఓకే కానీ.. అరెస్టుల పర్వం మాత్రం దాదాపు సాగలేదని చెప్పవచ్చు. కేంద్ర పెద్దలు తమకు అడ్డు ఉన్న నేతలను నియంత్రించేందుకు సిబిఐ, ఈడీలను వాడుకుంటారే తప్ప.. ఆ కేసులను ముందుకు కదిలించేందుకు ఇష్టపడరని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కోవలోకే కవిత, చంద్రబాబు వెళతారని.. కేవలం రాజకీయంగా నియంత్రించేందుకే వారిపై కేసులని కామెంట్స్ వినిపిస్తున్నాయి.