యోగి ఆదిత్యనాథ్ ది తప్పే లేదంటారా?

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా ఘటన కావడంతో రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చాలా వరకు విమర్శలు ఉన్నాయి. ఈ కేసులో యోగి సర్కార్‌‌ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. Also Read: కేంద్రం ఆర్డర్స్: పండుగల వేళ ఇవి పాటించాల్సిందే.. ఇప్పటికే.. బాధితురాలిపై రేప్‌ జరగలేదని, స్పెర్మ్‌ ఆనవాళ్లు ఏమీ లేవంటూ డాక్టర్లు రిపోర్టులు ఇచ్చారు. దీనికితోడు హత్యాచారానికి గురైన […]

Written By: NARESH, Updated On : October 7, 2020 3:45 pm
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా ఘటన కావడంతో రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చాలా వరకు విమర్శలు ఉన్నాయి. ఈ కేసులో యోగి సర్కార్‌‌ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

Also Read: కేంద్రం ఆర్డర్స్: పండుగల వేళ ఇవి పాటించాల్సిందే..

ఇప్పటికే.. బాధితురాలిపై రేప్‌ జరగలేదని, స్పెర్మ్‌ ఆనవాళ్లు ఏమీ లేవంటూ డాక్టర్లు రిపోర్టులు ఇచ్చారు. దీనికితోడు హత్యాచారానికి గురైన యువతి అంత్యక్రియలనూ కనీసం కుటుంబ సభ్యులకు కూడా అనుమతి లేకుండా పోలీసులే నిర్వహించడంపైనా విమర్శలు వచ్చాయి. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్‌ పెద్దలు ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య కూడా ఉత్తరప్రదేశ్‌ చేరుకొని బాధితురాలి పేరెంట్స్‌ను పరామర్శించారు. ప్రతిపక్షాల ఆరోపణలకు ఇప్పుడు యోగి సర్కార్‌‌ పరిష్కారం వెతుకుతోంది.

రేప్‌ ఘటనను అలుసుగా తీసుకొని కొందరు ప్రభుత్వంపై కుట్రలు చేశారని.. గుర్తు తెలియని వ్యక్తల మీద ఏకంగా దేశ ద్రోహం కేసులు నమోదు చేయించింది యోగి సర్కార్‌‌. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని.. కొందరు బాధిత కుటుంబానికి డబ్బులు ఇవ్వాలని చూశారని ఆరోపించారు. అయితే వాళ్లు ఎవరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పుకున్నారు. ఎవరో తెలియకుండా డబ్బులు ఇస్తామన్న విషయాన్ని ఎలా కనిపెట్టారనేది అంతుచిక్కని విషయం. అటు మీడియానూ యూపీ సర్కార్ టార్గెట్‌ చేసింది. బాధితురాలి కుటుంబసభ్యులతో జర్నలిస్టులు మాట్లాడారంటూ.. వారిని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కోంటోంది. మరోవైపు యూపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని బాధితులు చెబుతున్నారు.

Also Read: కేంద్రంతో కయ్యం.. ఎవరికి నష్టం.?

అయితే.. యూపీ పోలీసులు అసలు ఈ కేసు గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కానీ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకు మాత్రం పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. మొత్తం ఈ అంశానికి కులం, మతం రంగును పులిమి దానిని స్వప్రయోజనాలకు ఉపయోగించే ప్రయత్నం జరుగుతోందని యూపీ సర్కార్ కోర్టుకు చెప్పుకొచ్చింది. ఈ మాటలు వింటుంటే యూపీ ప్రభుత్వం ఈ కుట్ర నుంచి బయట పడే ప్రయత్నంలానే ఉన్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.