అక్టోబర్ అంటేనే పండుగల నెల. ఒక విధంగా రాబోయే ఈ మూడు నెలలు పండుగలే. అటు పండుగలు.. ఇటు కరోనా.. ఇప్పుడు ప్రజలు పరేషాన్‌లో పడ్డారు. ఓ వైపు చూస్తే ఇంకా కరోనా తగ్గుముఖం పట్టలేదు. మరోవైపు పండుగలు ముంచుకొస్తున్నాయి. కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.. రోజుకు వెయ్యి మందికి పైగా చనిపోతూనే ఉన్నారు.
Also Read: కేంద్రంతో కయ్యం.. ఎవరికి నష్టం.?
అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు దేశంలో ఏదో ఒక చోట పండుగలు జరుగుతుంటాయి. దసరా, దీపావళి, క్రిస్మస్, తెలంగాణలో అయితే బతుకమ్మ వంటి వేడుకల్లో వేలాది మంది ప్రజలు పాల్గొంటుంటారు. ప్రజలంతా ఒక దగ్గర చేరితే వైరస్ మరింత పేట్రెగిపోయే ప్రమాదామూ పొంచి ఉంది.
అందుకే.. ఈసారి పండుగల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కంటైన్‌మెంట్ జోన్లలో పండుగలకు పర్మిషన్ నిరాకరించింది. ఆ ప్రాంతాల్లోని జనం ఇళ్లలోనే పండుగలు జరుపుకోవాలని మంగళవారం ఎస్‌ఓపీ విడుదల చేసింది.
Also Read: భారత్ ఐటీకి దెబ్బ: హెచ్1బీ వీసా కలిగిన టెకీలకు ట్రంప్ షాక్?
పండుగల్లో విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను చేతులతో తాకరాదని సూచించింది. పాటల పోటీలు నిర్వహించకూడదని, బృందాలుగా పాడకూదంది. పండుగలు జరిగే చోట ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా మార్కింగ్ చేయాలి. ఒక్కొక్కరి మధ్య 6 అడుగుల దూరం ఉండాలి. క్యూలైన్లలోనూ ఇదే విధానం పాటించాలి. థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలి. ప్రాంగణాలను తప్పనిసరిగా శానిటైజేషన్ చేయించాలి. విగ్రహాల నిమజ్జన వేళ పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతించాలి. ర్యాలీల్లో అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలి అంటూ సూచించింది.