https://oktelugu.com/

నిహారిక పెళ్లికి పవన్ భార్య ఎందుకు వెళ్ళలేదంటే..?

నిహారిక-చైతన్యల వివాహం రాజస్థాన్ లోని ప్రముఖ ఉదయ్ పూర్ ప్యాలస్ వేదికలో ఘనంగా జరిగింది. కాగా, మెగా ఫ్యామిలీ మొత్తం రెండు రోజుల క్రితమే ఉదయ్ పూర్ ప్యాలస్ కి వెళ్లి ప్రీ వెడ్డింగ్ వేడుకల దగ్గర నుండి పెళ్లి వరకూ తెగ సందడి చేశారు. చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్ లతో పాటు పవన్ కూడా వేడుకల్లో పాల్గొని మెగా అభిమానులకు ఫుల్ జోష్ ను అందించాడు. అయితే ఈ పెళ్లికి మెగా కుటుంబంతో మెగా […]

Written By:
  • admin
  • , Updated On : December 11, 2020 / 12:30 PM IST
    Follow us on


    నిహారిక-చైతన్యల వివాహం రాజస్థాన్ లోని ప్రముఖ ఉదయ్ పూర్ ప్యాలస్ వేదికలో ఘనంగా జరిగింది. కాగా, మెగా ఫ్యామిలీ మొత్తం రెండు రోజుల క్రితమే ఉదయ్ పూర్ ప్యాలస్ కి వెళ్లి ప్రీ వెడ్డింగ్ వేడుకల దగ్గర నుండి పెళ్లి వరకూ తెగ సందడి చేశారు. చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్ లతో పాటు పవన్ కూడా వేడుకల్లో పాల్గొని మెగా అభిమానులకు ఫుల్ జోష్ ను అందించాడు. అయితే ఈ పెళ్లికి మెగా కుటుంబంతో మెగా సన్నిహితులు అందరూ హాజరయ్యారు, ఒక్కరు తప్ప. ఆమె పవన్ సతీమణి. ఆమె ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువైపోయాయి. నిజానికి చిరంజీవి, నాగబాబు ఫ్యామిలీల్లో చిన్న చిన్న అకేషన్లకు కూడా ఆమె హాజరైన సందర్భాలు గతంలో చాలా వున్నాయి.

    Also Read: త‌మ‌న్నా, మెహ‌రీన్‌ మళ్లీ ఓ రేంజ్ లో కుమ్మేస్తారట !

    అలాంటిది నిహారిక పెళ్లికి ఎందుకు రాలేదు అంటే.. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో లేరని, రష్యా వెళ్లారని అందుకే పెళ్లికి హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లారట. పవన్ భార్యకు ఓ అలవాటు వుందని, ప్రతి ఏటా డిసెంబర్ లో రష్యా వెళ్లి క్రిస్మస్ వేడుకలు చేసుకుని, సరిగ్గా క్రిస్మస్ టైమ్ కు హైదరాబాద్ వచ్చేస్తారని సమాచారం. సహజంగా పవన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారట. కానీ, నిహారిక పెళ్లి కారణంగానే పవన్ రష్యా వెళ్లలేదట. మొత్తానికి నిహారిక పెళ్లి ఆల్బమ్ లో పవన్ భార్య, ఆమె పిల్లల పిక్స్ మిస్ అవ్వడం పవన్ ఫ్యాన్స్ ను కొంత నిరాశ పరిచింది.

    Also Read: అప్పటి సీక్రెట్స్ : శాంతి, ప్రశాంతిలతో శోభన్ బాబు రహస్య ప్రేమ !

    ఇక గత కొన్ని రోజులుగా పవన్ వకీల్ సాబ్ షూట్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలాగే పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నిహారిక పెళ్లి కోసం దీక్షకు బ్రేక్ ఇచ్చి మరీ ఉదయ్ పూర్ కు చేరుకుని.. పెళ్లి లో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక పవన్ తన కొడుకు అకీరాతో కలిసి ఈ వేడుకకు హాజరు కావడం, పవన్ కంటే.. అకీరా ఫోటోలే ఎక్కువగా వైరల్ కావడం విశేషం. పవన్ మాజీ భార్య అకీరా తల్లి రేణూ దేశాయ్ ఈ పెళ్లికి దూరంగా ఉన్నారు. ఏది ఏమైనా పవన్ భార్యలు వెళ్ళకపోయినా.. పవన్ పెళ్లికి వెళ్లి ఆ లోటు తీర్చారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్