https://oktelugu.com/

జగన్‌ వ్యూహంలో టీడీపీ చిక్కుకుందా..?

ఓ వైపు పంచాయతీ ఎన్నికలు వద్దని జగన్‌ ఎంత మొత్తుకున్నా.. ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఈ ఎన్నికల్లో మెజార్టీ పంచాయతీలను కైవసం చేసుకొని సత్తా చాటాలని అనుకుంటున్నాడు జగన్‌. అందుకే.. ప్రతీ పంచాయతీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని అనుకున్నారు. ఇందులో నగదు ప్రోత్సహకం కూడా పెంచారు. కానీ.. అంతటా టీడీపీ నేతలు నామినేషన్లు వేసేందుకు ముందుకు రావడంతో జగన్‌ ప్లాన్‌ పెద్దగా వర్కవుట్‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 20, 2021 / 11:17 AM IST
    Follow us on


    ఓ వైపు పంచాయతీ ఎన్నికలు వద్దని జగన్‌ ఎంత మొత్తుకున్నా.. ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఈ ఎన్నికల్లో మెజార్టీ పంచాయతీలను కైవసం చేసుకొని సత్తా చాటాలని అనుకుంటున్నాడు జగన్‌. అందుకే.. ప్రతీ పంచాయతీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని అనుకున్నారు. ఇందులో నగదు ప్రోత్సహకం కూడా పెంచారు. కానీ.. అంతటా టీడీపీ నేతలు నామినేషన్లు వేసేందుకు ముందుకు రావడంతో జగన్‌ ప్లాన్‌ పెద్దగా వర్కవుట్‌ కాలేదు.

    Also Read: చంద్రబాబుకు ఇంతకంటే అవమానం ఉండదేమో?

    ఎన్నికల్లో తనకు అనుకూలంగానే ఫలితాలొస్తాయని జగన్ నమ్మారు. కానీ.. టీడీపీ నేతలను కట్టడి చేయడానికి జగన్ రచించిన వ్యూహం ఫలించలేదు. దూకుడు మీద ఉన్న టీడీపీ నేతలకు కళ్లెం వేసే దిశగా వైసీపీ ప్రయత్నించింది. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడు అరెస్ట్.. ఆయన బెయిల్ పై తర్వాత బయటకు వచ్చినా దాదాపు వారం రోజులు జైలులోనే ఉండిపోయారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని నామినేషన్ వేయకుండా బెదిరించారన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు.

    అయితే..ఈ అచ్చెన్నాయుడి ఎపిసోడ్‌ టీడీపీ బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. ఎక్కడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇన్‌చార్జీలు పంచాయతీ ఎన్నికలలో దూకుడు చూపలేదు. అచ్చెన్న అరెస్ట్ తర్వాత పూర్తిగా పంచాయతీ ఎన్నికలకు దూరమయ్యారు. మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా ఇదే తరహా కేసు నమోదైంది. ఇలా పంచాయతీ ఎన్నికల వేళ కీలక నేతలపై కేసులు నమోదుకావడంతో మిగిలిన ప్రాంతాలపై ఆ ఎఫెక్ట్ పడిందంటున్నారు. దీంతో వైసీపీ నేతలు ఓటింగ్ సమయంలో తమ పని కానిచ్చేసుకున్నారంటున్నారు. మరోవైపు.. అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంపై అటు అధినేత చంద్రబాబు కూడా పెద్దగా స్పందించలేదు.

    Also Read: జగన్ కరుణించే ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరో..?

    వారం రోజుల పాటు జైలులో ఉన్నా అచ్చెన్నాయుడును కీలక నేతలు ఎవరూ పరామర్శించలేదు. ఇలా జగన్ రూపొందించిన అచ్చెన్న అరెస్ట్ వ్యూహం టీడీపీ నేతల్లో బాగా పనిచేసిందనే చెప్పాలి. దాని కారణంగానే అనేక జిల్లాల్లో నామినేషన్లు వేసినా కొందరు ప్రచారం కూడా చేయలేదంటున్నారు. ఇలా వైసీపీ పంచాయతీ ఎన్నికలకు ముందు జగన్ అనుసరించిన వ్యూహాలే ఆ పార్టీని గట్టెక్కించాయి. టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్