Employees: ఏపీ సర్కార్ వర్సెస్ ఉద్యోగ సంఘాల వార్ లో సీఎం జగన్ దే పైచేయిగా నిలిచింది. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై తిరుగుబావుట ఎగురవేసిన ఉద్యోగ సంఘాలు అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఇటీవల ఉద్యోగులు చేసిన సమ్మె వారికి ఎలాంటి లాభం చేకూర్చకపోగా అభాసుపాలైంది. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా ఉద్యోగి జీతంలో నాలుగు నుంచి 5వేల కోతకు సిద్ధం కావడంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది.
మొన్నటి అనుభవంతో ఉద్యోగ సంఘాలు సమ్మె చేసేందుకు జంకుతున్నాయి. దీనికితోడు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. ప్రభుత్వం అన్ని ఆలోచించే వారికి జీతాలు తగ్గించదనే కామెంట్స్ సామాన్యుల నుంచి విన్పిస్తున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా పోరాటాలు చేయడం మానుకోవాలని వారంతా హితవు పలుకుతుండటం గమనార్హం. ప్రజల నుంచి వారికి మద్దతు రాకపోవడానికి గతంలో ఉద్యోగులు చేసిన పొరపాట్లేనని స్పష్టంగా అర్థమవుతోంది.
Also Read: ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇదొక్కటే పరిష్కారం !
ప్రభుత్వ కార్యాయాల్లో ఉద్యోగాలు చేసే సిబ్బంది ఏనాడో ప్రజా సేవడమే మరిచిపోయారు. మిగతా వారికంటే తామే అధికమన్న ఫీలింగుతో కార్యాలయాలకు వచ్చిన ప్రజలతో ప్రవర్తించేవారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో ఒకింత వ్యతిరేకత మొదలైంది. దీనికితోడు ఉద్యోగ సంఘాల నేతలు ఓ పార్టీకి కొమ్ముకాస్తుండటం, రాజకీయ నాయకుల మాదిరిగా స్టేట్ మెంట్స్ ఇస్తుండటం అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఈ కారణాలన్నీ కూడా ప్రజల నుంచి వీరిని క్రమంగా దూరం చేశాయనే వాదనలు విన్పిస్తున్నాయి.
కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరిస్తుండగా మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వీరిలోని అనైక్యతే ఉద్యోగులకు శాపంగా మారింది. దీనికి ప్రభుత్వం తనకు అనకూలంగా మార్చుకుంటోంది. ఈ కారణంగానే ప్రభుత్వం పీఆర్సీపై నియమించిన అశుతోష్ కమిటీ మిశ్రా నివేదిక పూర్తిగా పక్కకు పెట్టేసింది. తమకు కావాల్సిన నివేదికను అధికారులతో ప్రభుత్వం తెప్పించుకొని జీతాల్లో కోత పెట్టేసింది. డీఏలు పెండింగ్ లేకుండా చూసుకున్న సర్కారు హెచ్ఆర్ఏలో కోత విధించింది.
దీంతో ఒక్కో ఉద్యోగి జీతంలో నాలుగు నుంచి ఐదు వేలకు వరకు తగ్గే అవకాశం కన్పిస్తోంది. ఓవైపు రోజువారీ ఖర్చు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగాల జీతాల్లో కోత పెట్టడం ఇబ్బందికరంగా మారింది. పీఆర్సీ అమలు చేయకపోగా జీతాల్లో కోత విధించడంతో ఉద్యోగులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే గతంలో ఎదురైనా అనుభవాల దృష్ట్యా సమ్మె చేసేందుకు మాత్రం ఉద్యోగులు వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఏపీ ఉద్యోగుల బాధ వర్ణానాతీతంగా మారిపోయింది.
Also Read: ఎన్టీఆర్ చేతి రాతను ఎప్పుడైనా చూశారా.. కడిగిన ముత్యాలే..!