Telangana Politics: తెలంగాణలో ఇప్పుడిప్పుడే కొత్త రాజకీయాలు పుట్టుకొస్తున్నాయి. మొన్నటి వరకు ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ మాత్రమే ఉందని అనుకోగా.. గత రెండేళ్లలో ప్రధాన ప్రతిపక్ష, విపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో బలంగా తయారయ్యాయి. అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను తమ పార్టీలో చేర్చుకుని ఆయా పార్టీలు తమ కేడర్‌ను పెంచుకుంటున్నాయి. వీటికి నిదర్శనంగా హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలనే చెప్పుకోవచ్చు.

అయితే మారుతున్న రాజకీయాలను గమనిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తమ ఉనికి పోకుండా జాగ్రత్త పడుతుంది. ఎత్తుకు పై ఎత్తు వేసి, ప్రతిపక్ష, విపక్షాలను అడ్డుకుంటుంది. అందులో భాగంగానే అధికార పార్టీ నుంచి పెద్ద నేతలు పర్యటనకు వస్తే ప్రతిపక్ష నాయకులను హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు ధర్నాలు, నిరసనలు చేపట్టినా వారిని అడ్డుకుంటున్నారు. CM KCR, KTR) పర్యటనల సందర్భంగా ఇలాంటి ఘటనలు చేసుకున్నాయి. తాజాగా ఆర్ధిక, ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు పర్యటనలోనూ ఇదే చోటు చేసుకుంది.

తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు, అటవీ, పర్యావరణ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే ఈ పర్యటనలోనూ ప్రతిపక్ష నేతలు కొందరిని అరెస్ట్ చేయగా మరికొందరిని గృహ నిర్బంధన చేశారు. నిర్మల్ జిల్లాలో పర్యటిస్తుండగా.. ఆ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ జడి చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి హౌజ్ అరెస్ట్ చేశారు. అటు రిమ్స్ పర్యటనలోనూ యువజన కాంగ్రెస్ నాయకుడిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడడం దారి తీసింది. నిర్మల్ జిల్లాలో జరిగిన ఘటనే ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పునరావృత్తమైంది. ఇవే కాకుండా కేంద్రం విడుదల చేసిన నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి కేంద్ర మంత్రితో పాటు, స్థానిక మంత్రి కూడా లేకుండా ప్రారంభోత్సవం చేశారు. స్థానిక ఎంపీకి నామమాత్రపు ఆహ్వానం అందించి, అతను లేని సమయంలో ఆసుపత్రి ప్రారంభోత్సవం చేశారని ఆరోపణలు వచ్చాయి.
Also Read: AP Capital Issue: కోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చ.. జగన్ లేని ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారా..?
ఇలా ప్రతిచోటా, అధికార పార్టీ నాయకులు పర్యటించే క్రమంలో ప్రతిపక్ష, విపక్ష నాయకులను అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నాయకులు భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా, లేక ప్రజల్లో తమ ఆదరణ తగ్గిపోతుందని వ్యూహంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అని ప్రజలు చర్చింకుంటున్నారు. ఇంతకుముందు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వస్తే సమస్యలపై వినతులు ఇచ్చేవాళ్లమని, ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు. ఈ తరహా రాజకీయాలకు స్వస్తి పలికి, రాజకీయాల్లో స్నేహపూరిత వాతావరణం నెలకొల్పాలని అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా వాతావరణం నెలకొల్పడానికి ప్రతిపక్ష, అధికార నాయకులు కృషి చేయాలని అంటున్నారు.
Also Read:Bandi Sanjay: మానసిక వైద్యుని అవతారం ఎత్తిన సంజయ్.. ఏం చేశాడంటే..