Mahesh Babu Social Services: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఆయన మంచి మనసును చాటుకున్నాడు. ఈయన పలు సేవ కార్యక్రమాలు చేస్తాడన్న విషయం తెలిసిందే.. రీల్ లైఫ్ లోనే కాదు ఈయన రియల్ లైఫ్ లో కూడా ఆయన సేవ కార్యక్రమాలతో హీరో అనిపించు కుంటున్నాడు. మహేష్ బాబు చిన్నారులకు సహాయం చేయడంలో క్షణం కూడా ఆలోచించడు. ఈ విషయంలో ఎప్పుడు ముందుంటాడు.

ఆర్ధికంగా స్థోమత లేని వారికీ మహేష్ బాబు తన డబ్బులతో వైద్యం చూపిస్తూ చిన్నారుల ప్రాణాలను నిలబెడుతున్నాడు. ఇలా మహేష్ వెయ్యికి పైగానే హార్ట్ సర్జరీలు చేయించి వారందరి కుటుంబాల్లో సంతోషం నిలిచేలా చేసాడు. ఇక ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసాడు. మహేష్ బాబు హార్ట్ సర్జరీల కోసం రెయిన్ బో, ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి పని చేస్తున్నాడు..
మహేష్ తాజాగా రెయిన్ బో హాస్పిటల్స్ కి చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ తో కలిసి పనిచేయ బోతున్నాడు.. ఈ క్రమంలో ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ని ప్రారంభించారు. ఈ వేడుకలో మహేష్ బాబు మాట్లాడుతూ.. పిల్లలు నా హృదయానికి ఎప్పుడు దగ్గరగానే ఉంటారు.. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది.. ఈ ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు సహాయం చేయడం ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు మహేష్.

ఈ విషయం తెలిసిన వారందరు మహేష్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈయన మంచి మనసుకి అందరు శబాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.. మహేష్ ముందు ముందు ఇంకా చాలా మంది చిన్నారులకు ఈయన సహాయం చేయాలనీ అందరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రెసెంట్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.