AP Capital Issue: ఏపీ రాజధాని విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే జగన్ సర్కార్ కు షాక్ ఇస్తూ హైకోర్టు మన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సి ఆర్ డి ఏ చట్టం ప్రకారమే నడుచుకోవాలని, రైతులకు ఫ్లాటు డెవలప్ చేసి ఇవ్వాలంటూ ఆదేశించింది. పైగా తన తీర్పులో రేట్ ఆఫ్ మాండమాస్ ను కూడా చేర్చడం పెను సంచలనంగా మారిన విషయం అందరికీ విధితమే. అయితే ఈ తీర్పుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ మాత్రం నేరుగా ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ అసెంబ్లీ వేదిక దీనిపై చర్చ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఈ మేరకు జగన్ కు లేఖ రాయడం కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్ వ్యూహం లేనిదే ఆయన ఆ లేఖ రాసే అంత ధైర్యం చేయరన్న విషయం విదితమే. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అసెంబ్లీ వేదికగా హైకోర్టు తీర్పుపై చర్చ పెట్టాలనే యోచనలో జగన్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
Also Read: కీలక స్థానం నుంచి ప్రకాష్ రాజ్ పోటీ.. కేసీఆర్ అంత పెద్ద త్యాగం చేస్తున్నారేంటి..?
కానీ ఇక్కడే ఓ విషయం జగన్ మర్చిపోతున్నట్టున్నారు. అసలే ఓవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచి టెన్షన్ పెడుతోంది. ఇక ఇదివరకే హైకోర్టు తీర్పుపై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో కామెంట్లు చేసే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి ఇలాంటి క్లిష్ట సమయంలో హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ జగన్ లేనిపోని చిక్కులు కొనితెచ్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వీలైనంతవరకూ వివాదరహితుడిగా మెలగడమే జగన్ కు మేలు అని కొందరు సూచిస్తున్నారు. కాదు లేదు అని జగడానికి వెళితే జగన్ ఇబ్బందుల్లో పడ్డట్టే అని కూడా చెబుతున్నారు. మరి జగన్ కు ఈ విషయాలు అన్ని తెలియవా అంటే.. ఇక్కడే ఓ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

శాసనసభలకు చట్టాలు చేసే అధికారం ఉందని వాటిని చేయొద్దు అని చెబితే ఎలా ఉంటూ ఇండైరెక్టుగా కోర్టుకు తాను చెప్పాలనుకున్నది చెప్పే విధంగా చర్చకు తేవాలని జగన్ భావిస్తున్నారు. కానీ రిట్ ఆఫ్ మాండమాస్ ను మాత్రం చర్చించకుండా కేవలం తీర్పు పైనే చర్చించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ అది కూడా చాలా ప్రమాదమే అని అంటున్నారు. మొత్తానికి జగన్ లేనిపోని తలనొప్పులు తెచ్చుకునే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెబుతున్నారు.
Also Read: ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి వేటు తప్పదా.. ఆయన ప్లేస్ లో వచ్చేది అతనేనట..
[…] […]