Homeకరోనా వైరస్కరోనా సోకని ఒకే ఒక సురక్షిత ప్రాంతం

కరోనా సోకని ఒకే ఒక సురక్షిత ప్రాంతం

నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికి ఎక్కడకు వెళ్లాలో ఎవ్వరికీ తెలియడం లేదు. ఎక్కడికి వెళ్లినా ఆ వైరస్ కు గురయ్యే ప్రమాదం ఉన్నదని భయపడుతున్నారు. అయితే భూ ఆవరణలో ఈ వైరస్ సోకని ఒకే ఒక సురక్షిత ప్రాంతం ఒకటి ఉన్నట్లు అమెరికాలోని నాసా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కేంద్రం ఒక్కటే సురక్షితం అని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం 164 దేశాలకు కరోనా విస్తరించింది. 2 లక్షల మంది దీని […]

నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికి ఎక్కడకు వెళ్లాలో ఎవ్వరికీ తెలియడం లేదు. ఎక్కడికి వెళ్లినా ఆ వైరస్ కు గురయ్యే ప్రమాదం ఉన్నదని భయపడుతున్నారు.

అయితే భూ ఆవరణలో ఈ వైరస్ సోకని ఒకే ఒక సురక్షిత ప్రాంతం ఒకటి ఉన్నట్లు అమెరికాలోని నాసా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కేంద్రం ఒక్కటే సురక్షితం అని స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం 164 దేశాలకు కరోనా విస్తరించింది. 2 లక్షల మంది దీని బారిన పడగా దాదాపు 8 వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు వైరస్ పై యుద్ధమే చేస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకని సురక్షిత ప్రాంతం ఈ భూమండలం మీదే లేదంటున్నారు నిపుణులు. అయితే భూ సమీప కక్ష్యలో తిరుగుతున్న స్పేస్ స్టేషన్ సురక్షితమంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే, సుమారు ఇరవై ఏళ్లలో ఈ స్టేషన్లోని ఓ ఆస్ట్రోనాట్ కు జలుబు మాత్రమే చేసిందట. ఈ కేంద్రంలో హెల్త్ స్టెబిలైజేషన్ ప్రోగ్రాం కొన్నాళ్లుగా కొనసాగుతున్నందున ఈ కేంద్రానికి వైరస్ సోకే చాన్స్ లేదు. ఈ కేంద్రానికి పంపించే వారికి పది రోజులపాటు అన్ని వైద్యపరీక్షలు చేసిన తర్వాతే వారిని అనుమతిస్తారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper