దేశంలోనే ఏపీకి అత్యంత అన్యాయం: జగన్

ఏపీ సీఎం జగన్ బయటపడ్డారు. కేంద్రం తీరుతో ఆవేదన చెందిన తన అక్కసు, ఆవేదనను వెళ్లగక్కారు. పోలవరం నిధులు, అంచనాలు పెంచాలని ప్రధాని మోడీకి లేఖ రాసిన మరునాడే జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. నవంబర్ 1. నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘పొట్టి శ్రీరాములుతోపాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి. మహానుభావుల […]

Written By: NARESH, Updated On : November 1, 2020 1:58 pm
Follow us on

ఏపీ సీఎం జగన్ బయటపడ్డారు. కేంద్రం తీరుతో ఆవేదన చెందిన తన అక్కసు, ఆవేదనను వెళ్లగక్కారు. పోలవరం నిధులు, అంచనాలు పెంచాలని ప్రధాని మోడీకి లేఖ రాసిన మరునాడే జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. నవంబర్ 1. నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘పొట్టి శ్రీరాములుతోపాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి. మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ.. వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం మనమంతా అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం’ అని సీఎం పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

రాష్ట్ర ఆవతరణ దినోత్సవరం సందర్భంగా దేశంలోనే ఏపీకి అన్యాయం జరిగిందని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ఏపీ చరిత్రలోనే మన అంతగా దగా పడిన రాష్ట్ర దేశంలో మరొకటి లేదని’ వాపోయారు. బయటి వారి కత్తిపోట్లు, సొంతవారి వెన్ను పోట్లతో ఏపీ నష్టపోయిందన్నారు.

Also Read: ప్రైవేట్ పాఠశాలలకు జగన్ సర్కార్ షాక్.. టీసీ లేకుండానే…?

ఏపీలో ఇప్పటికే 32 లక్షల నిరుపేద కుటుంబాలు ఉన్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల స్థితిగతులను మెరుగుపరుస్తూ.. గ్రామాల రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

17 నెలలుగా ఏపీలో వివక్ష లేని అవినీతి లేకుండా పాలన అందిస్తున్నానని.. ఏపీని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యం అని జగన్ అన్నారు.

Also Read: ఏపీని టార్గెట్ చేసిన బీజేపీ.. జగన్ కు చెక్ యేనా?

ఎవరూ సాయం చేసినా చేయకపోయినా ఏపీని పునర్నిర్మిస్తానని.. పారదర్శకతతో పాలన అందిస్తానని తెలిపారు.

ఈసందర్భంగా ఏపీ గవర్నర్ హరిచందన్ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.