
‘మొదలు లేదు మొగుడా అంటే.. పెసరపప్పు వండవే పెళ్లామా’ అంటూ క్యాప్షన్ పెట్టి సైబరాబాద్ పోలీసులు విడుదల చేసిన ఓ ఫొటో వైరల్ గా మారుతోంది. హైదరబాద్ లో ఓ వ్యక్తి అరటిపండు తింటూ బండి నడుపుతున్న ఓ వ్యక్తి ఫొటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్యాప్షుర్ చేశారు. ఇలాంటి వాళ్ల వల్ల వారికే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని వారు ట్విట్టర్లో పెట్టి పోస్టు చేశారు. బండి నడిపేటప్పడు ఇతర విషయాలపై కాకుండా వాహనంపై దృష్టి సారించాలని అంటున్నారు.
బండి నడిపేటప్పుడు రోడ్డు పైనే ధ్యాస పెట్టాలి. డ్రైవింగ్ చేయడం ఒక బాధ్యత. ఇతర బయటి విషయాల పై దృష్ఠి పెడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ నియమాలు పాటించండి. క్షేమంగా ఉండండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/JYaDfQ1T12
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) November 1, 2020