https://oktelugu.com/

అల్లు అర్జున్ మ్యాజిక్.. ప్రభాస్ ను బీట్ చేశాడుగా?

టాలీవుడ్ సినిమా స్టామీనా బాలీవుడ్ ను మించిపోయింది. ఒకప్పుడు కలెక్షన్ల పరంగా బాలీవుడ్ సినిమాలు ముందంజలో ఉండేవి. అయితే ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయినట్లు కన్పిస్తున్నాయి. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సినిమాల కంటే అత్యధిక కలెక్షన్లు సాధిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటుతున్నాయి. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ తెలుగు హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే ‘బాహుబలి’ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 12:44 PM IST
    Follow us on

    టాలీవుడ్ సినిమా స్టామీనా బాలీవుడ్ ను మించిపోయింది. ఒకప్పుడు కలెక్షన్ల పరంగా బాలీవుడ్ సినిమాలు ముందంజలో ఉండేవి. అయితే ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయినట్లు కన్పిస్తున్నాయి. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సినిమాల కంటే అత్యధిక కలెక్షన్లు సాధిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటుతున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    తెలుగు హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే ‘బాహుబలి’ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ సత్తా చూపించాడు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్ల రికార్డులను సృష్టించింది. ఈ సినిమా తర్వాత ‘సాహో’ సైతం ఉత్తరాదిన మంచి వసూళ్లు సాధించి తెలుగు సినిమా సత్తాను బాలీవుడ్ కు రుచిచూపించింది.

    Also Read: ఆర్ఆర్ఆర్ రచ్చ.. రాజమౌళిపై బండి సంజయ్ ఫైర్

    ప్రభాస్ బాటలోనే టాలీవుడ్ స్టార్లు పాన్ ఇండియా మూవీలను చేస్తుండటం అందరిచూపు ఇటువైపు మళ్లింది. ఎన్టీఆర్.. మహేష్ బాబు.. రాంచరణ్.. అల్లు అర్జున్ తదితర స్టార్లు పాన్ ఇండియా మూవీలు చేస్తూ టాలీవుడ్ స్టామినాను పెంచుతున్నారు. ఇక తాజాగా ఓ ప్రైవేట్ సంస్థ సోషల్ మీడియాలో నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ హీరోల్లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తొలిస్థానంలో ఉన్నట్లు ప్రకటించింది.

    Also Read: థియేటర్ల పరిస్థితి సంక్రాంతికి మారనుందా?

    బాహుబలితో ప్రభాస్ క్రేజ్ అమాంతం పేరుగగా.. బన్నీకి ‘అల వైకుంఠపురములో’ మూవీతో అతడి ఇమేజ్ డబులైంది. సోషల్ మీడియాలో సర్వే ప్రకారం.. అల్లు అర్జున్ తొలిస్థానంలో ఉండగా ప్రభాస్ రెండో ప్లేస్ లో ఉన్నట్లు తేలింది. దీంతో డార్లింగ్ ప్రభాస్ ను ‘దేశముదురు’ వెనక్కినెట్టయింది. ఆ తర్వాత స్థానాల్లో మహేష్.. పవన్ కల్యాణ్.. ఎన్టీఆర్.. చిరంజీవి.. రాంచరణ్ ఉన్నట్లు సదరు సర్వే వెల్లడించింది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తుండగా అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ చేస్తున్నాడు.