Indigo crisis: ఇండిగో సంస్థకు సంబంధించిన విమానాలు అర్థంతరంగా ఆగిపోవడం మనదేశంలో తీవ్ర కలవరాన్ని కలిగించాయి.. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు విమానాశ్రయాలకు పరిమితమయ్యారు. ఉన్నట్టుండి విమానాలు ఆగిపోవడంతో ప్రయాణికులు నరకం చేశారు.. వాస్తవానికి విమానాలు ఆగిపోవడం మన దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు.. ఇతర సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు విమానాలను నిలిపివేస్తారు. కానీ ఎటువంటి కారణాలు లేకుండానే ఇండిగో సంస్థ విమానాలు ఆపివేయడం దేశవ్యాప్తంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలిగించింది.
విమానాలు ఆగిపోవడం వెనక టర్కీ దేశం పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండిగో సంస్థకు టర్కీస్ ఎయిర్ లైన్స్ తో విస్తృతమైన కోడ్ షేర్ బాండింగ్ ఉంది. టర్కీస్ ఎయిర్లైన్స్ ను నేరుగా టర్కీ ప్రభుత్వమే నియంత్రిస్తోంది.
కొన్ని సంవత్సరాలుగా భారత్, టర్కీ మధ్య అంత గొప్పగా సంబంధాలు లేవు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ కు టర్కీ బహిరంగ మద్దతు పలికింది. దీంతో భారతీయ కంపెనీలు టర్కీని బహిష్కరించాయి.. అంతేకాదు టర్కీ అధ్యక్షుడి కుమార్తెకు ప్రయోజనం కలిగించే సెలేబి ఏర్పోర్ట్ సర్వీసెస్ కాంట్రాక్టు ను భారత రద్దు చేసింది. అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురికావడానికి ముందు మనదేశంలో టర్కీ దేశానికి చెందిన విమానాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ప్రజలు సహజంగానే ఎయిర్ ఇండియా వైపు దృష్టిస్తారించారు. ఈ కుట్ర అనేక రకాలుగా మలుపులు తిరిగింది.. పుతిన్ మనదేశంలో పర్యటిస్తున్నప్పుడే పశ్చిమ దేశాలు సరికొత్త వ్యూహాలు అవలంబించాయి.. అయితే ఈ వ్యవహారం వెనుక టర్కీ మాత్రమే కాకుండా, ఇంకా చాలా దేశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2020లో ట్రంప్ భారత్లో పర్యటిస్తున్నప్పుడు సిఏఏ వ్యతిరేక నిరసనలు ఎలా అయితే వ్యక్తమయ్యాయో.. పుతిన్ భారతలో పర్యటిస్తున్నప్పుడు కూడా పశ్చిమ దేశాలు అదే విధంగా అసౌకర్యానికి గురయ్యాయి.
ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్లు, ఇతర వేడుకలు విస్తృతంగా జరుగుతూ ఉంటాయి. ఈ మార్కెట్ మొత్తాన్ని స్తంభింప చేయడానికి ఈ విధమైన కుట్రలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంక్షోభానికి ఇండిగో సంస్థలో ఉన్న అంతర్గత బలహీనతలు కూడా ఒక కారణమని తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ పైలెట్ ల విశ్రాంతి సమయాన్ని పెంచింది.. ఈ నిబంధనలను 2024 జనవరిలో విడుదల చేసింది. అయితే వీటిని ఇండిగో సంస్థ మాత్రం పాటించలేదు.. సొంత పైలెట్ అకాడమీ ఉన్నప్పటికీ సకాలంలో పైలెట్లను ఇండిగో సంస్థ నియమించుకోలేదు. ఇండిగో సంస్థలో గంగువాల్ కుటుంబం తమ వాటాలను నిరంతరం విక్రయించుకునే పనిలో పడింది. అందులో వాటాలను పశ్చిమ దేశాలకు చెందిన బ్యాంకులు కొనుగోలు చేశాయి. అందువల్లే ఇటీవల విమానాలను తెలివిగా నిలిపివేశాయి.
ప్రభుత్వం పైలెట్ల విశ్రాంతి సమయాన్ని.. రాత్రి కాలంలో ఆపరేషన్ల నియమాలను అత్యంత కఠిన తరం చేసింది. దీంతో రోజుకు 2300 విమానాలను నడిపే ఇండిగో సంస్థ మీద విపరీతమైన ఒత్తిడి పడింది. పైలెట్లు విమానాలు నడపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. కంపెనీ కావాలనే విమానాలను నిలిపివేసిందని తెలుస్తోంది. పలువురు పైలెట్లు విజిల్ బ్లోయర్లుగా ముందుకు వచ్చి ఈ నిజాలను వెల్లడించారు.