Pakistan Army officer winks: పాకిస్తాన్.. అసలే అది ఉగ్రవాద దేశం. ఎక్కడ బాంబులు పేలుతాయో.. ఎక్కడ జనం చనిపోతారో.. ఎక్కడ ఏం జరుగుతుందో.. ఎవరూ చెప్పలేరు. ఆ దేశంలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఉగ్రవాదులు స్థావరాలు ఏర్పరచుకొని అక్కడ కార్యకలాపాలు సాగిస్తుంటారు.
ఇటీవల ఆపరేషన్ సిందూర్ నిర్వహించినప్పుడు పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలు బయటపడ్డాయి.. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏ ఒక్క పాకిస్తాన్ పౌరుడు కూడా గాయపడలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం తమ దేశంలో పౌరులు చనిపోయారని.. తీవ్రంగా ఆస్తి నష్టం చోటుచేసుకుందని వ్యాఖ్యానించడం మొదలుపెట్టింది.. ఇక పాకిస్తాన్ లో ఉగ్రవాదులు, అక్కడి పాలకులు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంటారు. ఉగ్రవాదులకు అనుకూలంగా అక్కడి పరిపాలకులు నిర్ణయాలు తీసుకుంటారు..
పాకిస్తాన్ పరిపాలకులు ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోరు. దేశాభివృద్ధి అనేది వారికి ఇష్టం ఉండదు. ప్రజలు చెల్లించే పన్నులు మాత్రమే వారికి కావాలి. పైగా ఉగ్రవాదుల దాడుల్లో ప్రజలు చనిపోయిన సరే అక్కడి పరిపాలకులు ఏమాత్రం పట్టించుకోరు. ఇదే విషయంపై ఎవరైనా జర్నలిస్టులు ప్రశ్నిస్తే మాత్రం పాకిస్తాన్ పాలకులకు ఎక్కడా లేని కోపం వస్తుంది. పైగా పాకిస్తాన్ పాలకులు పాత్రికేయులపై అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఒక మహిళా జర్నలిస్టుపై వ్యవహరించిన తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.
పాకిస్తాన్ ఆర్మీ టాప్ ర్యాంక్ ఆఫీసర్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఓ మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టారు. “మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దేశ భద్రతకు ప్రమాదకరమైన వ్యక్తి. దేశద్రోహి.. భారత్ చెప్పినట్టు వింటాడని”అహ్మద్ ఆరోపించారు.. ఈ నేపథ్యంలో ఆ మహిళా జర్నలిస్టు అహ్మద్ ను ఉద్దేశించి.. ఇమ్రాన్ ఖాన్ గురించి ప్రస్తావించారు.. దానికి అహ్మద్ ఆమెకు కన్ను కొట్టాడు..” నేను గతంలో చేసిన ఆరోపణల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొత్తగా ఇమ్రాన్ ఖాన్ కు పిచ్చోడు అనే ముద్ర కూడా వేయాలి” అంటూ అహ్మద్ వ్యాఖ్యానించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అహ్మద్ వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
WATCH | Pak Army spokesperson seen WINKING at woman journalist during a press briefing.
Lt Gen Chaudhry, well-known Pakistan Army officer, is known for aggressive press briefings that often include strong anti-India comments. pic.twitter.com/tnIaDODw8X
— The Tatva (@thetatvaindia) December 10, 2025