అమెరికాపై భారత సంతతి ఆధిపత్యం : బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

అగ్రరాజ్యానికి జో బైడెన్‌ అధ్యక్షుడు అయ్యాక భారతీయ అమెరికన్ల ప్రాతినిథ్యం రోజురోజుకూ పెరుగుతోందని ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా పేర్కొన్నారు. దేశ పాలనలో కీలక పదవులను అధిరోహించి.. తమ దేశంపై వారు పట్టు పెంచుకుంటున్నారని ప్రశంసించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) శాస్త్రవేత్తలతో వర్చువల్‌ విధానంలో ఆయన మాట్లాడారు. Also Read: మండలిలోనూ వైసీపీదే బలం.. దగ్గరపడ్డ సమయం ‘అమెరికాలో భారత సంతతి విస్తరిస్తోంది. వారు ఈ దేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మీరు (స్వాతిమోహన్‌), ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌, […]

Written By: Srinivas, Updated On : March 5, 2021 2:43 pm
Follow us on


అగ్రరాజ్యానికి జో బైడెన్‌ అధ్యక్షుడు అయ్యాక భారతీయ అమెరికన్ల ప్రాతినిథ్యం రోజురోజుకూ పెరుగుతోందని ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా పేర్కొన్నారు. దేశ పాలనలో కీలక పదవులను అధిరోహించి.. తమ దేశంపై వారు పట్టు పెంచుకుంటున్నారని ప్రశంసించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) శాస్త్రవేత్తలతో వర్చువల్‌ విధానంలో ఆయన మాట్లాడారు.

Also Read: మండలిలోనూ వైసీపీదే బలం.. దగ్గరపడ్డ సమయం

‘అమెరికాలో భారత సంతతి విస్తరిస్తోంది. వారు ఈ దేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మీరు (స్వాతిమోహన్‌), ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌, నా ప్రసంగ ప్రతి రాసిన వినయ్‌ రెడ్డి అంతా భారతీయ అమెరికన్లే’ అని బైడెన్‌ చెప్పారు. నాసా మార్స్‌ మిషన్‌ 2020 (గైడెన్స్‌, నావిగేషన్‌, కంట్రోల్‌ ఆపరేషన్స్‌)కు నాయకత్వం వహిస్తున్న స్వాతి మోహన్‌ గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

Also Read: కాంగ్రెస్‌లో సీనియర్‌‌ నేతల ఐక్యతారాగం.. టార్గెట్‌ సాగర్‌‌ బైపోల్‌

కాగా.. జనవరి 20న బైడెన్‌ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ పదవి చేపట్టిన 50 రోజుల్లో. ఆయన యంత్రాంగంలో 55 మంది భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. ఇంతమంది భారత సంతతి వ్యక్తులు ప్రజాసేవలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉండడాన్ని చూడడం ఆకట్టుకుంటోందని అభిప్రాయపడ్డారు. అయితే.. బడ్జెట్‌ చీఫ్‌గా భారతీయ మూలాలున్న నీరా టండన్‌ నియామకంపై మాత్రం ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు