మండలిలోనూ వైసీపీదే బలం.. దగ్గరపడ్డ సమయం

ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల బిల్లును అక్కడి శాసనమండలి తిరస్కరించింది. ఈ బిల్లుతోపాటు కీలక సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుపడింది. అయితే.. శాసనసభలో పూర్తిస్థాయి వన్‌సైడ్‌ అన్నట్లుగా 151 సీట్లు భారీ మెజార్టీ సాధించిన జగన్‌కు.. శాసన మండలిలో మాత్రం బలం లేకుండా పోయింది. దీంతో ఆ శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు సీఎం జగన్‌ అసహనంతో నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇప్పటికీ మండలి వైసీపీని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. Also […]

Written By: Srinivas, Updated On : March 5, 2021 2:33 pm
Follow us on


ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల బిల్లును అక్కడి శాసనమండలి తిరస్కరించింది. ఈ బిల్లుతోపాటు కీలక సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుపడింది. అయితే.. శాసనసభలో పూర్తిస్థాయి వన్‌సైడ్‌ అన్నట్లుగా 151 సీట్లు భారీ మెజార్టీ సాధించిన జగన్‌కు.. శాసన మండలిలో మాత్రం బలం లేకుండా పోయింది. దీంతో ఆ శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు సీఎం జగన్‌ అసహనంతో నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇప్పటికీ మండలి వైసీపీని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది.

Also Read: కాంగ్రెస్‌లో సీనియర్‌‌ నేతల ఐక్యతారాగం.. టార్గెట్‌ సాగర్‌‌ బైపోల్‌

అయితే.. రాబోయే మే నెలతో ఆ ఇబ్బందులన్నీ పటాపంచలు కాబోతున్నాయి. 58 స్థానాల ఏపీ శాసన మండలిలో అధికార వైసీపీ బలం కేవలం 13, టీడీపీకి 29 మంది సభ్యులున్నారు. మిగతావి ఖాళీలు, ఇతరులకు దాఖలు పడ్డాయి. టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీలోకి, ఒకరు బీజేపీలోకి మారినా వారి మందబలం తగ్గలేదు. తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా వైసీపీ తరపున ఆరుగురు ఎన్నిక కాబోతున్నారు.

ఈ ఏడాది మే నెలతో స్థానిక కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 11 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ జోరు చూస్తుంటే కచ్చితంగా ఆ 11 స్థానాలు కూడా వైసీపీకే దక్కుతాయనేది స్పష్టంగా తెలుస్తోంది. అంటే మే నెలకల్లా టీడీపీ బలం తగ్గిపోవడంతో పాటు, పరిషత్ ఎన్నికలు పూర్తయి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే వైసీపీ మెజార్టీ పెరుగుతుంది. అంటే అక్కడితో టీడీపీ అరాచకాలకు ఫుల్ స్టాప్ పడుతుందన్న మాట. ఇన్నాళ్లూ ఈ మంది బలం చూసే టీడీపీ ఎగిరెగిరి పడింది.

Also Read: కోదండరాం ఒంటరి పోరుకు ఆ ఎమ్మెల్యే మద్దతు

ఇప్పటికే అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును హోల్డ్‌లో పెట్టి వైసీపీ సహనాన్ని పరీక్షించింది మండలి. ఇప్పుడిక ఆ ఆటలకు అడ్డుకట్ట పడే రోజొచ్చింది. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా వైసీపీకి సంపూర్ణ విజయం సాకారం కాలేదు. రేపు స్థానిక ఎన్నికల కోటాలో వైసీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచి మండలిలో అడుగు పెడితే.. అప్పుడే వైసీపీ విజయం సంపూర్ణం అవుతుంది. మే తర్వాత మండలిలో టీడీపీ చెత్త రాజకీయాలకు చరమగీతం పాడే అవకాశాలే ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీ నిర్ణయాలన్నీ చకచకా పట్టాలపైకి రావడం గ్యారెంటీ.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్