https://oktelugu.com/

స్టార్ హీరోయిన్ పెళ్లి.. అతనితోనే !

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ‘శ్రద్ధ కపూర్’ పెళ్లి పై ఇప్పటికే అనేక రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీకి పెళ్ళి ఫిక్స్ అయిందట. ఇంతకీ ఎవరితో అంటే.. చాలా కాలంగా శ్రద్ధ తన చిన్ననాటి స్నేహితుడు రోహన్ శ్రేష్ఠతో పీకల్లోతు ప్రేమలో మునిగి తడిసి ముద్దవుతూ ఉంది. అంత మునిగిపోయాక, ఇక పెళ్లి చేసుకోకపోతే ఏం బాగుంటుందని ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని మొత్తానికి ఒక్క అభిప్రాయానికి వచ్చేసి పెళ్లిని ఖాయం చేశారట. Also […]

Written By:
  • admin
  • , Updated On : March 5, 2021 / 02:52 PM IST
    Follow us on


    బాలీవుడ్ స్టార్ బ్యూటీ ‘శ్రద్ధ కపూర్’ పెళ్లి పై ఇప్పటికే అనేక రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీకి పెళ్ళి ఫిక్స్ అయిందట. ఇంతకీ ఎవరితో అంటే.. చాలా కాలంగా శ్రద్ధ తన చిన్ననాటి స్నేహితుడు రోహన్ శ్రేష్ఠతో పీకల్లోతు ప్రేమలో మునిగి తడిసి ముద్దవుతూ ఉంది. అంత మునిగిపోయాక, ఇక పెళ్లి చేసుకోకపోతే ఏం బాగుంటుందని ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని మొత్తానికి ఒక్క అభిప్రాయానికి వచ్చేసి పెళ్లిని ఖాయం చేశారట.

    Also Read: ప్రభాస్‌ బాడీపై శ్రీరెడ్డి హాట్‌ కామెంట్స్‌

    అయితే శ్రద్ధ రోహన్ శ్రేష్ఠని పెళ్లాడనుందనే వార్తలు గత రెండేళ్ల నుండి వస్తూనే వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రద్ధ నిజంగా రోహన్ ని పెళ్లాడాలనుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని శ్రద్ధ తండ్రి శక్తి కపూర్ ఇప్పటికే మీడియాకి డైరెక్ట్ గానే క్లారిటీ ఇచ్చాడు. ఐతే, తన కూతురు ఇప్పటివరకూ తనతో పెళ్లి ప్రస్తావన తేలేదు అని, అందుకే నేను కూడా ఆమె పెళ్లి గురించి ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదని.. నిజంగా ఆమె రోహన్ శ్రేష్ఠతో రిలేషన్ లో ఉందా ? లేదా ? అనే డౌట్ నాకూ ఉందని శ్రద్ధ తండ్రి అప్పట్లో చెప్పుకొచ్చాడు.

    Also Read: చిరంజీవి రీమేక్ స్టారా..? సూప‌ర్ హిట్ల‌న్నీ అవేనా..?!

    ఇక తాజాగా రోహన్ తండ్రి కూడా అదే మాట మీడియాతో చెప్పాడు. “నా కొడుకు శ్రద్ధ కపూర్ ని పెళ్లి చేసుకోవాలంటే… ఆనందంగా ఒప్పుకుంటాం. కొడుకు ఇష్టాన్ని కాదనే వ్యక్తిత్వం కాదు మాది,” అని ఆయన తన అభిప్రాయాన్ని శ్రద్ధా కపూర్ కి చేరేలా చెప్పారు. ఏది ఏమైనా అటు శ్రద్ధ కపూర్ తండ్రి, ఇటు ‘కాబోయే మావయ్య’ ఇద్దరూ బహిరంగంగా తమ పెళ్ళికి ఓకే చెప్పారు కాబట్టి.. మరి శ్రద్ద కపూర్ కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోందా ? లేక ఎప్పటిలాగే.. పెళ్లి అంటే, చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ గా వెళిపోతుందా ? చూడాలి. సాహోతో శ్రద్ధ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే చేరువ అయింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్