Homeజాతీయ వార్తలుIndia Pakistan water issue: పాకిస్తాన్‌ జలాలతో భారత్‌ గేమ్స్‌..!

India Pakistan water issue: పాకిస్తాన్‌ జలాలతో భారత్‌ గేమ్స్‌..!

India Pakistan water issue: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలు ధ్వంసమయ్యాయి. 11 ఎయిర్‌ బేస్‌లపై భారత్‌ వైమానిక దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్‌లోని విమానాలు కూడా ఎగరలేని పరిస్థితి నెలకొంది. ఈ ఆపరేషన్‌ తర్వాత భారత్‌ ఏం చేయగలతో నిరూపితమైంది. అయినా పాకిస్తాన్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. సింధూ జలాల ఇవ్వకపోతే యుద్ధం చేస్తామని ప్రకటిస్తోంది. అయినా మోదీ పాకిస్తాన్‌ నీటితో గేమ్స్‌ మొదలు పెట్టారు.

Also Read: డీఎస్పీ సిరాజ్ సాబ్ ఆన్ ఫైర్.. డకెట్ కు ఏడుపొకటే తక్కువ.. ఈ కోపానికి రీజన్ ఉంది

సింధూ జల ఒప్పందం (1960) భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నీటి వనరుల పంపిణీకి కీలకం. ఈ ఒప్పందం ప్రకారం, బియాస్, రావి, సట్లెజ్‌ నదులు భారత్‌కు, ఇండస్, చినాబ్, ఝీలం నదులు పాకిస్తాన్‌కు కేటాయించబడ్డాయి. అయితే, 2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌ ఈ ఒప్పందాన్ని సస్పెండ్‌ చేసింది. ఈ నిర్ణయం భారత్‌కు నీటి వనరులపై ఎక్కువ నియంత్రణను ఇచ్చింది, ఫలితంగా పాకిస్తాన్‌లో నీటి కొరత, వరదల వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మరో నదిపైనా భారత్‌ పవర్‌ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో చినాబ్‌ నదిపై నిర్మితమవుతున్న క్వార్‌ హైడ్రో ప్రాజెక్టు ఒక రన్‌–ఆఫ్‌–ది–రివర్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం. ఈ ప్రాజెక్టు 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.

19 శాతం పనులు పూర్తి..
క్వార్‌ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం 19% పనులు పూర్తయ్యాయి, రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.4,500 కోట్ల అంచనా వ్యయం ఉంది, ఇందులో రూ.3 వేల కోట్లు రుణాల ద్వారా సేకరించబడుతున్నాయి. చినాబ్‌ నది పాకిస్తాన్‌కు కేటాయించిన నది కావడంతో, క్వార్‌ ప్రాజెక్టు నీటి ప్రవాహాన్ని నియంత్రించే సామర్థ్యం కలిగి ఉంది. ఇది పాకిస్తాన్‌ వ్యవసాయానికి, ముఖ్యంగా ఇండస్‌ నదీ వ్యవస్థపై ఆధారపడే పంటలకు సవాళ్లను సృష్టించవచ్చు.

Also Read: అజిత్‌ డోభాల్‌ : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాడు

భారత్‌ జల వ్యూహం.
సింధూ జల ఒప్పందం సస్పెన్షన్, క్వార్‌ వంటి ప్రాజెక్టుల త్వరితగతిన నిర్మాణం భారత్‌ నీటి వనరులను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందని సూచిస్తున్నాయి. ఇది భారత్‌కు శక్తి భద్రతను పెంచడమే కాక, పాకిస్తాన్‌పై ఒత్తిడిని కూడా పెంచుతుంది. సిందూ ఒప్పందం పునఃసమీక్షకు భారత్‌ పట్టుపడుతోంది. అది జరిగేలోగా క్వార్‌ ప్రాజెక్టు పూర్తి చేయాలని భారత్‌ భావిస్తోంది. అది పూర్తయితే పాకిస్తాన్‌ చినాబ్‌ నదికి నీటిని విడుదల చేయడం అనివార్యం అవుతుంది. మొత్తంగా భారత్‌ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లాల్సిన సిందు జలాలు, పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి రావాల్సిన చినాబ్‌ జలాలతో మోదీ గేమ్స్‌ మొదలు పెట్టారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular