Deviyani Sharma Latest Photos: సేవ్ ది టైగర్ ఫేమ్ దేవియాని శర్మ స్విమ్ సూట్ ఫోటోలు షేర్ చేసి ఇంస్టాగ్రామ్ ని హీటెక్కించింది. హాస్పిటల్ నుండి వచ్చిన వెంటనే స్విమ్మింగ్ కి రెడీ అయినట్లు కామెంట్ చేసిన దేవయాని, రికవరీ మోడ్ లో ఉందట.
ఢిల్లీ భామ దేవియాని శర్మ(Deviyani Sharma) టాలీవుడ్ లో కెరీర్ వెతుక్కుంటుంది. మోడల్ గా కెరీర్ ఆరంభించిన దేవియాని శర్మ… హిందీ చిత్రం లవ్ శుదా చిత్రంతో చిన్న పాత్ర చేసింది. అనంతరం ఆమె తెలుగులో అడుపెట్టింది. 2020లో విడుదలైన భానుమతి రామకృష్ణ చిత్రంలో కీలక రోల్ చేసింది. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ దక్కించుకోవడం విశేషం. ఆహా లో నేరుగా విడుదల చేశారు. 2023లో విడుదలైన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ దేవియానికి మంచి పేరు తెచ్చింది.
Also Read: నాన్న.. నమస్తే… కల్వకుంట్ల కవితకు ఎంత గతి పట్టే..
దర్శకుడు మహి వీ రాఘవ తెరకెక్కించిన సేవ్ ది టైగర్స్ కామెడీ సిరీస్ కాగా, విశేష ఆదరణ దక్కించుకుంది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య, జోర్దార్ సుజాత, దేవియాని, పావని గంగిరెడ్డి ప్రధాన పాత్రలు చేశారు. కృష్ణ చైతన్య భార్య పాత్ర చేసింది దేవియాని. హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ సక్సెస్ కావడంతో సీజన్ 2 సైతం విడుదల చేశారు. 2024లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3 స్ట్రీమ్ అయ్యింది. రెండు సీజన్స్ కలిపి మొత్తం 13 ఎపిసోడ్స్ గా ఉంది.
సేవ్ ది టైగర్ సీరీస్ దేవియానికి మంచి పేరు తెచ్చింది. దర్శకుడు మహి వి రాఘవ సైతాన్ టైటిల్ తో మరో వెబ్ సిరీస్ చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ సైతాన్ లో దేవియాని సీరియస్ అండ్ ఇంటెన్స్ రోల్ చేసింది. లేడీ కిల్లర్ రోల్ లో భయపెట్టింది. సైతాన్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి బెస్ట్ చాయిస్. నటనలో మంచి ప్రతిభ చూపుతున్నప్పటికీ దేవియానికి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు.
మరోవైపు అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా నెటిజెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ కి దేవియాని శర్మ పెట్టింది పేరు. మూడు లక్షలకు పైగా ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. తాజాగా స్విమ్ సూట్ లో బెడ్ పై రొమాంటిక్ ఫోజులతో కూడిన ఫోటోలు షేర్ చేసింది. కారణం తెలియదు కానీ అమ్మడు హాస్పిటల్ పాలైందట. హాస్పిటల్ నుండి వచ్చిన వెంటనే పనిలో మునిగిపోయిందట. రికవరీ మోడ్ అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. దేవియాని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram